ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని అఖిలపక్ష సమావేశంలో వైయస్ఆర్‌సీపీ డిమాండ్ చేసింది. పార్లమెంట్ వర్షాకాల బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలోవైయస్ఆర్‌సీపీ తరపున ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి హాజరయ్యారు. ఏపీలో క్షీణించిన శాంతి భద్రతల పరిస్థితులను వైయస్ఆర్‌సీపీ వివరించింది. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని అఖిలపక్ష సమావేశంలో వైయస్ఆర్‌సీపీ డిమాండ్ చేయగా, టీడీపీ మాత్రం మౌనంగా ఉంది. బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని జేడీయూ డిమాండ్ చేసింది. ఢిల్లీ వేదికగా టీడీపీ దాడులను ఎండగడతాం: విజయసాయిరెడ్డి అఖిల పక్ష భేటీ అనంతరం ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో 45 రోజుల్లో 39 హత్యలు, 300 మందిపై హత్యాయత్నాలు జరిగాయని.. ఢిల్లీ వేదికగా టీడీపీ దాడులను ఎండగడతామన్నారు. ఢిల్లీలో బుధవారం వైయస్ జగన్ నేతృత్వంలో ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. బ్లాక్ మెయిల్ చేసే మీడియాను అడ్డుకునే చట్టం తీసుకురావాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు.