గిద్దలూరు: కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు అలియాస్ నానాజీ మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిపై ఇటీవల చేసిన హేయమైన, అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు గిద్దలూరు పట్టణ పోలీస్ స్టేషన్‌లో వైయస్ఆర్‌సీపీ నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గిద్దలూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ కె.పి. నాగార్జున రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులపై వ్యక్తిగత దూషణలు, అవమానకర వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు. రాజకీయ విమర్శలు హుందాగా ఉండాలని, వ్యక్తిగత స్థాయికి దిగజారి మాట్లాడటం ప్రజా ప్రతినిధులకు తగదని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి పట్ల నానాజీ చేసిన వ్యాఖ్యలు కోట్లాది మంది అభిమానుల మనోభావాలను దెబ్బతీశాయని, ఆయనపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బూత్ కమిటీ ప్రధాన కార్యదర్శి బొర్రా కృష్ణారెడ్డి, మైనారిటీ విభాగ కార్యదర్శి అబ్దుల్ గఫార్, రాష్ట్ర ఆర్టీఐ విభాగ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీపీ కడప వంశీధర్ రెడ్డి, రాష్ట్ర రైతు విభాగ ప్రధాన కార్యదర్శి సూర స్వామి రంగారెడ్డి, రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ సంయుక్త కార్యదర్శి చేరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, మండల, నగర పార్టీ కన్వీనర్లు మానం బాలిరెడ్డి, బత్తేమ్ ఓబుల్‌రావు, మేరీగ రవికుమార్‌తో పాటు గ్రామ, వార్డు పార్టీ అధ్యక్షులు, అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.