తాడేపల్లి: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భావితరాల భవిష్యత్తుకు ఉపాధ్యాయులే రూపశిల్పులని పేర్కొంటూ, విద్యాబోధనతో పాటు పిల్లల్లో కలలను సాకారం చేసుకునే స్ఫూర్తిని, విలువలను, మెరుగైన భవిష్యత్తును నిర్మించగలమనే ఆత్మవిశ్వాసాన్ని గురువులు నింపుతారని కొనియాడారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు ఘన నివాళి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఆయనకు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి గౌరవ నివాళులు అర్పించారు. పిల్లలకు జ్ఞానాన్ని అందిస్తూ, వారిని శక్తిమంతులుగా తీర్చిదిద్దేందుకు అంకితభావంతో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యాయుల సేవలకు అభినందనలు పిల్లలకు కేవలం పాఠాలు బోధించడం మాత్రమే కాకుండా వారి కలలకు బాటలు వేస్తూ, ఉన్నత విలువలను పెంపొందిస్తూ, మెరుగైన రేపటిని నిర్మించేలా ప్రోత్సహిస్తున్న ఉపాధ్యాయుల సేవలు ఎంతో విలువైనవని వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరికీ హ్యాపీ టీచర్స్ డే అంటూ శుభాకాంక్షలు తెలిపారు.