రైతులకు నిరంత‌రాయంగా విద్యుత్ స‌ర‌ఫ‌రా చేయాలి

హనుమ రెడ్డిపల్లి విద్యుత్‌ సబ్‌స్టేషన్ ఎదుట మాజీ ఎంపీ తలారి రంగయ్య ధర్నా

 అనంతపురం జిల్లా:  క‌ళ్యాణ‌దుర్గం నియోజ‌క‌వ‌ర్గంలోని హనుమ రెడ్డిపల్లి విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. రైతులకు సకాలంలో, నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేస్తూ మాజీ ఎంపీ తలారి రంగయ్య సబ్‌స్టేషన్‌ వద్ద రోడ్డుపై బైఠాయించారు. సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో వారికి తక్షణమే న్యాయం చేయాలని తలారి రంగయ్య ధ‌ర్నా చేప‌ట్టారు. వ్యవసాయానికి అవసరమైన విద్యుత్‌ను సక్రమంగా సరఫరా చేసి, రైతుల సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు.
 

Back to Top