ఫొటో దిగాలన్న విశ్వనాథ్‌ చివరి కోరిక నెరవేర్చిన వైయ‌స్‌ జగన్‌

రక్త క్యాన్సర్‌తో బాధపడుతున్న వీరాభిమాని కోరికకు ఆప్యాయంగా స్పందించిన మాజీ ముఖ్యమంత్రి

క‌ర్నూలు: రక్త క్యాన్సర్‌తో బాధపడుతున్న విశ్వనాథ్‌కు వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని కలిసి ఆయనతో ఒక ఫొటో దిగాలనేది చివరి కోరిక. వైయ‌స్‌ జగన్‌కు వీరాభిమాని అయిన విశ్వనాథ్‌ కోరిక గురించి తెలుసుకున్న వైయ‌స్ జ‌గ‌న్ గారు ఆయనకు ప్రత్యేకంగా సమయం కేటాయించారు. కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడిన వైయ‌స్‌ జగన్‌.. అనంతరం విశ్వనాథ్‌తో కలిసి ఫొటో దిగేందుకు స్వయంగా నేలపై కూర్చున్నారు. దీంతో విశ్వనాథ్‌ ఎంతో ఆనందానికి గురయ్యారు. ఆయన చివరి కోరికను నెరవేర్చిన జగన్‌ సార్‌ ఆప్యాయత కుటుంబ సభ్యుల మనసులను కదిలించింది. తమ కుటుంబానికి సమయం కేటాయించి విశ్వనాథ్‌ చివరి కోరికను నెరవేర్చిన వైయ‌స్‌ జగన్‌కు, ఈ సందర్భంగా సహకరించిన హఫీజ్‌ ఖాన్‌కు విశ్వనాథ్‌ కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కష్టాల్లో ఉన్న మనిషికి అండగా నిలిచి, ప్రేమ, ఆప్యాయత, మానవత్వాన్ని చూపించడమే నిజమైన నాయకత్వానికి నిదర్శనమని ఈ ఘటన మరోసారి చాటిచెప్పింది.


 

Back to Top