కర్నూలు జిల్లా: రిమాండ్‌లో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షిని వైయస్ఆర్‌సీపీ నాయకులు ములాఖత్‌లో కలిశారు. అనంతపురం జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, ప్రకాశం జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్, మాజీ మంత్రి సాకే శైలజానాథ్, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, యువనాయకుడు భీమ్‌రెడ్డి తదితరులు ఎమ్మెల్యే విరుపాక్షిని కలిసి ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వంలో రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా ఎమ్మెల్యే విరుపాక్షిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారని వైయస్ఆర్‌సీపీ నేతలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆత్మస్థైర్యం కోల్పోకుండా ప్రజల కోసం, పార్టీ కోసం ధైర్యంగా ముందుకు సాగాలని సూచించారు. ఎమ్మెల్యే విరుపాక్షిని కలిసిన వారిలో పలువురు వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.