శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా పార్టీ కార్యాలయంలో వైయస్ఆర్‌సీపీ జిల్లా పార్టీ విస్తృత స్థాయి సమావేశం జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అధ్యక్షతన నిర్వహించారు. జిల్లాలో పార్టీ కార్యకలాపాలు, సంస్థాగత అంశాలు, భవిష్యత్ కార్యాచరణపై నాయకులు, పార్టీ శ్రేణులతో చర్చించారు. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సమావేశంలో పిలుపునిచ్చారు. నాయకులకు ఐడీ కార్డుల పంపిణీ సమావేశంలో పార్టీ నాయకులకు ఐడీ కార్డులను పంపిణీ చేశారు. పార్టీ కార్యక్రమాల్లో నాయకుల భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేస్తూ, సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు, మండలాలు, గ్రామ స్థాయిలో పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తూ వైయస్ఆర్‌సీపీని మరింత బలోపేతం చేయాలని నాయకులు నిర్ణయించారు.