కడప: వైయస్ఆర్ కడప జిల్లా పార్టీ కార్యాలయంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కోర్ కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జరిగిన ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణ, జిల్లాలో పార్టీ బలోపేతం, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలపై విస్తృతంగా చర్చించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని, ప్రజా సమస్యలపై ప్రభుత్వ వైఫల్యాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లేలా పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో నిర్ణయించారు. రానున్న రోజుల్లో పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలు సూచించారు. సమావేశానికి వైయస్ అవినాష్ రెడ్డి, కే. సురేష్ బాబు, ఎస్.బి. అంజాద్ భాషా, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, డాక్టర్ సుధమ్మ, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, సెట్టిపల్లి రఘురాం రెడ్డి, పి. నరేన్ రెడ్డి, ఎమ్మెల్సీలు గోవింద్ రెడ్డి, రామచంద్ర రెడ్డి తదితరులు హాజరయ్యారు. పార్టీ శ్రేణులకు అండగా ఉంటాం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎవరూ ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదని, వైయస్ఆర్‌సీపీ ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని నేతలు భరోసా కల్పించారు. ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూ పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైన తీరును ప్రజలకు వివరించాలని నిర్ణయించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం వైయస్ఆర్‌సీపీ తరఫున నిరంతరం పోరాటం కొనసాగించాలని నేతలు స్పష్టం చేశారు. ఐకమత్యంతో ముందుకు జిల్లాలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి వైయస్ఆర్‌సీపీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని సమావేశంలో నిర్ణయించారు. రానున్న రోజుల్లో పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో కృషి చేయాలని నేతలు పిలుపునిచ్చారు. సమావేశంలో పాకా సురేష్, గురుమోహన్, పోరెడ్డి నరసింహారెడ్డి, సంబటూరు ప్రసాద్ రెడ్డి, తెలుగుపులి వెంకటసుబ్బమ్మ, దేవిరెడ్డి ఆదిత్య, సోషల్ మీడియా కోఆర్డినేటర్ వివేక్‌తో పాటు జిల్లా కోర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.