ఫీనిక్స్‌లో రాజన్న సేవా స్ఫూర్తి

వైయ‌స్‌ఆర్‌ 17వ వర్ధంతి సందర్భంగా వైయ‌స్‌ఆర్‌సీపీ ఫీనిక్స్‌ ఎన్నారై కమిటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

అరిజోనా : మహానేత, దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతిని పురస్కరించుకుని వైయ‌స్‌ఆర్‌సీపీ ఫీనిక్స్‌ ఎన్నారై కమిటీ, వైటలెంట్‌ సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది.  మహానేత వైయ‌స్‌ఆర్‌ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఆయన జీవితం, ప్రజాసేవ, ప్రజా సంక్షేమం కోసం చేసిన కృషిని ప్రతిబింబించే ప్రత్యేక ఆడియో-విజువల్‌ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు డాక్టర్‌ వైయ‌స్‌ఆర్‌తో తమకున్న వ్యక్తిగత అనుభవాలను గుర్తుచేసుకుంటూ ఆయన నిరాడంబరత, ధైర్యం, ప్రజాకేంద్రిత పాలనా విధానాన్ని స్మరించుకున్నారు. ప్రజాసేవ, మానవతా విలువలు, అవసరంలో ఉన్న వారికి అండగా నిలవాలనే డాక్టర్‌ వైయ‌స్‌ఆర్‌ స్ఫూర్తికి ప్రతీకగా ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వైయ‌స్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గ్లోబల్‌ ఎన్నారై కోఆర్డినేటర్‌, మాజీ ముఖ్యమంత్రి విద్యా సలహాదారు ఆలూరు సాంబశివరెడ్డి వర్చువల్‌గా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆలూరు సాంబశివరెడ్డి మాట్లాడుతూ.. డాక్టర్‌ వైయ‌స్‌ఆర్‌ ప్రజల నాయకుడిగా సామాన్య ప్రజలతో విడదీయరాని అనుబంధాన్ని ఏర్పరచుకున్నారని గుర్తుచేశారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కోసం ఆ ఆశయాలను కొనసాగిస్తున్న వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. రక్తదానం అత్యంత విలువైన సేవా కార్యక్రమమని, ఒక వ్యక్తి ఇచ్చే రక్తదానం మరొకరి ప్రాణాలను కాపాడే అవకాశం కల్పిస్తుందని సాంబశివరెడ్డి తెలిపారు. వైయ‌స్‌ఆర్‌ వర్ధంతి సందర్భంగా సేవా కార్యక్రమాన్ని నిర్వహించిన ఫీనిక్స్‌ ఎన్నారై కమిటీని అభినందించారు.

ఈ కార్యక్రమాన్ని ధీరజ్‌ పోలా, వంశీ ఎరువరం, చెన్నారెడ్డి మద్దూరి, రుక్మన్‌, శ్రీధర్‌ చెమిడితి, అంజిరెడ్డి, నాగేష్‌ పొర్ల, వేమ శేఖర్‌, విఘ్నేష్‌, కొండారెడ్డి, శ్రీనివాస్‌ మామిడి, హేమకుమార్‌, అజయ్‌ కాల్వ, కుడుముల సుధీర్‌, సుజన్‌, రాజేశ్వరరావు బండారు, రాజశేఖర్‌ అవుదూరి, హితేష్‌ తదితరులు నిర్వహించి పాల్గొన్నారు. పలువురు వాలంటీర్లు, కమ్యూనిటీ సభ్యులు కూడా కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.

కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన వైటలెంట్‌, రక్తదాతలు, వాలంటీర్లు, నిర్వాహకులకు ఫీనిక్స్‌ ఎన్నారై కమిటీ కృతజ్ఞతలు తెలిపింది. మహానేత వైయ‌స్‌ఆర్‌ చూపిన ప్రజాసేవ, మానవతా విలువలు, సమాజ సంక్షేమ స్ఫూర్తిని కొనసాగిస్తూ భవిష్యత్‌లోనూ మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని కమిటీ స్పష్టం చేసింది. 

Back to Top