మిస్సిసాగాలో ఘనంగా మహానేత వైయ‌స్‌ఆర్‌ వర్ధంతి కార్యక్రమం

వైయ‌స్‌ఆర్‌ ప్రజాసేవ, సంక్షేమ పాలనను స్మరించుకున్న వైయ‌స్ఆర్‌సీపీ కెనడా విభాగం

మిస్సిసాగా, కెనడా: మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయ‌స్‌ రాజశేఖర రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా కెనడాలోని మిస్సిసాగాలో వైయ‌స్ఆర్‌సీపీ కెనడా విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నివాళి కార్యక్రమం నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో వైయ‌స్‌ఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. వైయ‌స్‌ఆర్‌ ప్రజాసేవ, పేదలు, సామాన్య ప్రజల సంక్షేమం కోసం అమలు చేసిన పథకాలు, దూరదృష్టితో కూడిన నాయకత్వం, ప్రజల పట్ల ఆయన చూపిన నిబద్ధతను నాయకులు, కార్యకర్తలు, అభిమానులు స్మరించుకున్నారు.

వైయ‌స్‌ఆర్‌ ఆశయాలే స్ఫూర్తిగా..

వైయ‌స్‌ఆర్‌ కేవలం ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా పేదలు, రైతులు, బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసిన ప్రజానాయకుడిగా చిరస్థాయిగా నిలిచిపోయారని వక్తలు పేర్కొన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిన ఆయన పాలన నేటికీ స్ఫూర్తిదాయకమని గుర్తుచేసుకున్నారు. ప్రజాసేవలో వైయ‌స్‌ఆర్‌ చూపిన అంకితభావం, మానవతా దృక్పథాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. వైయ‌స్ఆర్‌సీపీ కెనడా అడ్వైజర్‌ డాక్టర్‌ జగన్మోహన్‌రెడ్డి మార్గదర్శకత్వంలో, వైయ‌స్ఆర్‌సీపీ కెనడా కన్వీనర్‌ వేణు చుక్కలూరు సమన్వయంతో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. కార్యక్రమ నిర్వాహకులుగా వైయ‌స్ఆర్‌సీపీ కెనడా కో-కన్వీనర్‌ సుబ్బారావు, యూత్‌ వింగ్‌ కన్వీనర్‌ నూర్‌ కీలకంగా వ్యవహరించారు.

వర్చువల్‌గా  హాజ‌రైన ముఖ్య అతిథులు

కార్యక్రమానికి వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ చల్లా మధుసూదన్‌రెడ్డి, మాజీ వైయ‌స్ఆర్‌సీపీ యూఎస్‌ఏ/ఎన్‌ఆర్‌ఐ కన్వీనర్‌, ఏపీ ప్రభుత్వ మాజీ నార్త్‌ అమెరికా ప్రత్యేక ప్రతినిధి పాండుగాయల రత్నాకర్‌, వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాలు) డాక్టర్‌ ప్రదీప్‌ చింత జూమ్‌ ద్వారా హాజరై ప్రసంగించారు. కెనడా కమ్యూనిటీ నాయకుడు కొండం వెంకట్‌రెడ్డి ప్రత్యక్షంగా పాల్గొని మాట్లాడారు. వైయ‌స్‌ఆర్‌ దూరదృష్టి, పేదలు, సామాన్య ప్రజల సంక్షేమం కోసం ఆయన చేసిన కృషి, ప్రజాసేవలో చూపిన అంకితభావాన్ని వక్తలు కొనియాడారు. 

వైయ‌స్‌ఆర్‌ సేవలు చిరస్మరణీయం

పేదలు, రైతులు, సామాన్య ప్రజల సంక్షేమం కోసం వైయ‌స్‌ఆర్‌ చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాలు ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని వైయ‌స్ఆర్‌సీపీ కెనడా విభాగం పేర్కొంది. వైయ‌స్‌ఆర్‌ ప్రజాసేవా స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రజల కోసం పనిచేయడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని తెలిపింది.

కార్యక్రమ విజయానికి కోర్‌ టీమ్‌ కృషి

కార్యక్రమ నిర్వహణ, వేదిక ఏర్పాట్లు, సమన్వయంలో అస్లాం, సుమంత్‌, యశ్వంత్‌ నిమ్మకాయల, గోపిరెడ్డి కృష్ణారెడ్డి, పురుషోత్తం రెడ్డి, కృష్ణ, ఆరిఫ్‌, డాక్టర్‌ నిరంజన్‌ చుక్కలూరు, సుబ్బారెడ్డి దుగంపూడి, శ్రీనివాస్‌ కొరపోరలు కీలక పాత్ర పోషించారు. కార్యక్రమానికి కృష్ణారెడ్డి పసల, రాజగోపాల్‌ గుంటక, విశ్వనాథ్‌ రెడ్డి, విజయభాస్కర్‌ రెడ్డి, కృష్ణ ఆలంపాటి, డాక్టర్‌ శివరెడ్డి అడ్వైజర్‌ కమిటీ సభ్యులుగా విలువైన మార్గదర్శకత్వం అందించారు.

పెద్ద సంఖ్యలో వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు, అభిమానులు

మిస్సిసాగా, పరిసర ప్రాంతాల నుంచి వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో కార్యక్రమానికి హాజరయ్యారు. వైయ‌స్‌ఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో చురుకైన పాత్ర పోషించిన కోర్‌ కమిటీ సభ్యులు, ఎగ్జిక్యూషన్‌ టీమ్‌, అడ్వైజర్‌ కమిటీ సభ్యులకు నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 


 

Back to Top