ఘనంగా పినిపే విశ్వరూప్‌ జన్మదిన వేడుకలు

 టీమ్‌ విశ్వరూప్‌ ఆధ్వర్యంలో కేక్‌ కటింగ్‌.. పాల్గొన్న డాక్టర్‌ పినిపే శ్రీకాంత్‌

 అమలాపురం: రాష్ట్ర మాజీ మంత్రి, అమలాపురం పార్లమెంట్‌ కోఆర్డినేటర్‌, పీఏసీ సభ్యులు పినిపే విశ్వరూప్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని టీమ్‌ విశ్వరూప్‌ ఆధ్వర్యంలో కేక్‌ కటింగ్‌ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అమలాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ పినిపే శ్రీకాంత్‌ పాల్గొని పినిపే విశ్వరూప్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, వంటెద్దు వెంకన్నాయుడు, పట్టణ అధ్యక్షులు సంసాని నాని, మండల అధ్యక్షులు కొనుకు బాపూజీతో పాటు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పినిపే విశ్వరూప్‌ ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. 

Back to Top