దత్తిరాజేరు: గజపతినగరం నియోజకవర్గం దత్తిరాజేరు మండల వైయస్ఆర్‌సీపీ విస్తృతస్థాయి సమావేశం ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య, యువనేత బొత్స సాయి గురు నాయుడు ముఖ్య అతిథులుగా హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పార్టీకి కార్యకర్తలే బలమని, గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత పటిష్టం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటూ, ప్రజా సమస్యలపై నిరంతరం స్పందించాలని సూచించారు. పార్టీ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో విస్తృతంగా తీసుకెళ్లాలని కోరారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని బూత్ స్థాయి నుంచి మండల స్థాయి వరకు పార్టీ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని నేతలు సూచించారు. కార్యకర్తల ఐక్యతే పార్టీ బలమని, ప్రజలతో మమేకం కావడమే పార్టీకి పునాది అని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీ విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.