ఆసియా కప్‌ విజేత టీమిండియాకు వైయ‌స్‌ జగన్‌ అభినందనలు

తాడేప‌ల్లి: ఆసియా కప్‌ ఫైనల్లో పాకిస్థాన్‌పై అద్భుత విజయం సాధించి టైటిల్‌ గెలుచుకున్న టీమిండియాకు వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ ఘన విజయంలో కీలక పాత్ర పోషించిన తెలుగుతేజం తిలక్‌ వర్మను ప్రత్యేకంగా అభినందించారు.

ఈ మ్యాచ్‌లో 51 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన తిలక్‌ వర్మ ప్రతిభ తెలుగు ప్రజలందరికీ గర్వకారణమని వైయ‌స్‌ జగన్ మోహ‌న్ రెడ్డి ప్ర‌శంసించారు. ఆసియా కప్‌ సాధించిన టీమిండియాకు  అభినందనలు తెలుపుతూ వైయ‌స్ జ‌గ‌న్ త‌న ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.

Image

Back to Top