అబద్ధాల పునాదులపై కూటమి ప్రభుత్వం ఏర్పాటు

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి మోసాలను వివరిద్దాం

ప్రతి గ్రామంలో వైయ‌స్ఆర్‌సీపీ జెండా ఎగురవేద్దాం

వైయ‌స్ఆర్‌సీపీ జోన్‌–3 ప్రచార విభాగం అధ్యక్షురాలు మైలా రత్నకుమారి పిలుపు

పెడన, కృష్ణా జిల్లా: 2024 ఎన్నికల్లో అమలుకు సాధ్యం కాని హామీలను ఇచ్చి వాటినే పునాదులుగా చేసుకుని కూటమి పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయని, అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్నాయని వైయ‌స్ఆర్‌సీపీ జోన్‌–3 ప్రచార విభాగం అధ్యక్షురాలు మైలా రత్నకుమారి ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వ మోసాలను స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల ముందుకు తీసుకెళ్లి ఎండగడదామని, ప్రతి గ్రామంలో వైయ‌స్ఆర్‌సీపీ జెండాను ఎగురవేద్దామని పిలుపునిచ్చారు. 2029 ఎన్నికల్లో పెడన ఎమ్మెల్యేగా రాము అన్నను అత్యధిక మెజారిటీతో గెలిపించి, వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకునే లక్ష్యంతో ప్రతి కార్యకర్త సమష్టిగా పనిచేయాలని కోరారు.  పెడన నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ విస్తృతస్థాయి సమావేశం నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రమేష్‌ (రాము) అధ్యక్షతన నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ శ్రేణులకు వైయ‌స్ఆర్‌సీపీ జోన్‌–3 ప్రచార విభాగం అధ్యక్షురాలు మైలా రత్నకుమారి దిశానిర్దేశం చేశారు. పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేసి, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థుల విజయానికి ప్రతి కార్యకర్త సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. 

 - అబద్ధాలు, మోసాలతో అధికారంలోకి వచ్చిన కూటమిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి

“గత ఎన్నికల్లో మనం ఎదుర్కొన్న ఓటమి నుంచి ఎన్నో అనుభవాలు నేర్చుకున్నాం. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల సమరం మొదలవుతోంది. రెట్టింపు ఉత్సాహంతో పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్లాలి. కూటమి ప్రభుత్వం అబద్ధాలు, మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలు చేశారో ప్రజలకు వివరిద్దాం. వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారి ప్రభుత్వంలో అమలైన సంక్షేమ పథకాలను, ప్రస్తుత పరిస్థితులను ప్రజల ముందు ఉంచాలి. సామాన్య ప్రజలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ప్రతి గ్రామంలో ప్రజలకు వివరించాలి” అని మైలా రత్నకుమారి అన్నారు.

- ప్రతి గ్రామంలో వైయ‌స్ఆర్‌సీపీ జెండా ఎగురవేద్దాం

“స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రతి వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థికి కార్యకర్తలంతా అండగా నిలవాలి. మనలో ఎలాంటి విభేదాలు లేకుండా అందరం కలిసికట్టుగా పనిచేయాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయడానికి పునాది. ప్రతి గ్రామంలో వైయ‌స్ఆర్‌సీపీ జెండా ఎగురవేయడమే మన లక్ష్యంగా ముందుకు సాగాలి” అని ఆమె పిలుపునిచ్చారు.

-  కేసులు, ఒత్తిళ్లకు భయపడకుండా పార్టీ కోసం పనిచేయాలి

“అధికార పార్టీ నుంచి ఇబ్బందులు, ఒత్తిళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. కార్యకర్తలపై కేసులు పెట్టినా భయపడాల్సిన అవసరం లేదు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా నిలబడాలి. జగనన్న నీతి, నిజాయితీతో కూడిన రాజకీయాలు చేస్తూ ప్రజల కోసం పనిచేశారు. అదే స్ఫూర్తితో స్థానిక సంస్థల ఎన్నికల్లో మన అభ్యర్థులను గెలిపించుకుని పార్టీని మరింత బలోపేతం చేసుకోవాలి” అని మైలా రత్నకుమారి స్పష్టం చేశారు.

- రాము అన్న గెలుపునకు స్థానిక ఎన్నికలు కీలకం

“స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులను గెలిపించుకోవడం ద్వారా పార్టీని బలోపేతం చేయాలి. మన ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా ఉప్పాల రాము అన్న‌ను అత్య‌ధిక మెజారిటీతో గెలిపించుకోవ‌డానికి  కూడా ఈ ఎన్నికలు ఎంతో కీలకం. ప్రతి కార్యకర్త ఐక్యంగా పనిచేసి పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలి. జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిగా చూడాలనే లక్ష్యంతో స్థానిక స్థాయి నుంచే పార్టీని బలోపేతం చేసుకోవాలి” అని మైలా రత్నకుమారి పిలుపునిచ్చారు.

Back to Top