అనంతపురం: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైయస్ఆర్‌సీపీ సోషల్ మీడియా నాయకులు, కార్యకర్తలు చురుకుగా పనిచేయాలని ఆ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి సూచించారు. పార్టీ సోషల్ మీడియా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ బాబా సలామ్‌తో పాటు సోషల్ మీడియా నాయకులకు తన క్యాంపు కార్యాలయంలో గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు వివరించాలని అనంత వెంకట్రామిరెడ్డి సూచించారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో పార్టీ సోషల్ మీడియా విభాగం సమన్వయంతో పనిచేయాలని అన్నారు. వైయస్ఆర్‌సీపీ సోషల్ మీడియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ బాబా సలామ్ మాట్లాడుతూ, సోషల్ మీడియా వేదికగా వస్తున్న రాజకీయ ప్రచారాలపై వాస్తవ సమాచారాన్ని ప్రజలకు చేరవేసేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. అవసరమైన సందర్భాల్లో లీగల్ సెల్ సహకారం అందుబాటులో ఉంటుందని తెలిపారు.