మాచవరం: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం మాచవరం మండలం మల్లవోలు గ్రామంలో వైయస్ఆర్‌సీపీ నాయకులపై పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. వైయస్ఆర్‌సీపీలో చురుగ్గా రాజకీయాల్లో ఉన్నందుకు గత మూడు రోజులుగా పోలీసులు తమను తిప్పుతూ నామినేషన్ దాఖలు చేయకుండా అడ్డుకుంటున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. నామినేషన్ దాఖలు చేసేందుకు చివరి రోజు కావడంతో చుక్కా రాజకుమార్, గంటెల బొర్రయ్య నామినేషన్ కేంద్రానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఉదయం 8.30 గంటలకు పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని తీసుకెళ్లారని వైయస్ఆర్‌సీపీ వర్గాలు తెలిపాయి. నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకునేందుకే పోలీసులు ఇలా వ్యవహరిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.