వైయస్సార్ జిల్లా: కొండాపురంలో టీడీపీ గూండాల బరితెగించారు. వైయస్సార్‌సీపీ సానుభూతిపరుల నామినేషన్లను టీడీపీ గూండాలు అడ్డుకున్నారు. వైఎస్సార్‌సీపీ మద్దతుదారులపై టీడీపీ మూకలు రాళ్లతో దాడిచేశారు. పోలీసులపైనా కూడా టీడీపీ గూండాలు దాడి చేశారు. కర్రలు, రాళ్ల దాడులతో టీడీపీ గూండాలు బీభత్సం సృష్టించారు. ఎక్కడపడితే అక్కడ మద్యం సేవించి.. కర్రలు, రాళ్లు తెచ్చుకొని పచ్చ గుండాలు అరాచకాలను సృష్టిస్తున్నారు. సీఎం రమేష్ స్వగ్రామం పోట్లాదుర్తిలో కూటమి నాయకుల దాష్టీకం ప్రదర్శించారు. నామినేషన్ కేంద్రాన్ని కూటమి మూకలు ఆక్రమించారు. నామినేషన్ వేసేందుకు వెళ్లిన వైయస్సార్‌సీపీ నేతలను మూకలు అడ్డుకున్నాయి. అధికారం మాదంటూ ఎవరూ నామినేషన్ వేయడానికి వీల్లేదంటూ హుకుం జారీ చేశారు. హనుమాన్ గుత్తి పంచాయతీ వైఎస్సార్సీపీ సర్పంచ్, వార్డు అభ్యర్థులను కూటమి గూండాలు అడ్డుకున్నారు.