కేతిరెడ్డి పెద్దారెడ్డిపై పోలీసుల ఆంక్షలు

తిమ్మంపల్లి నుంచి అనంతపురానికి తరలింపు.. టీడీపీ నేతల దాడి తర్వాతా వేధింపులు

అనంతపురం: తాడిపత్రి వైయ‌స్ఆర్‌సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై పోలీసులు ఆంక్షలు విధించారు. రెండు రోజుల క్రితం తాడిపత్రి పట్టణంలోని ఆయన ఇంటిపై టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గీయులు దాడి చేసిన ఘటన అనంతరం తిమ్మంపల్లిలో బస చేస్తున్న పెద్దారెడ్డిని అక్కడ కూడా ఉండకూడదంటూ పోలీసులు అనంతపురానికి తరలించారు.

తాడిపత్రిలోని ఆయన ఇంటిపై దాడి సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, జనరేటర్‌కు కూడా నిప్పు పెట్టారని వైయ‌స్ఆర్‌సీపీ వర్గాలు పేర్కొన్నాయి. ఘటన అనంతరం పెద్దారెడ్డి తన స్వగ్రామం తిమ్మంపల్లికి వెళ్లి అక్కడ బస చేశారు. అయితే అక్కడ కూడా ఉండేందుకు పోలీసులు ఆంక్షలు విధించి అనంతపురానికి తరలించడం పట్ల వైయ‌స్ఆర్‌సీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

టీడీపీ వర్గీయుల దాడి అనంతరం బాధితుడైన మాజీ ఎమ్మెల్యేపైనే ఆంక్షలు విధించి తరలించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రజాప్రతినిధిగా పనిచేసిన వ్యక్తి స్వగ్రామంలో కూడా ఉండకుండా పోలీసులు ఆంక్షలు విధించడం రాజకీయ వేధింపుల్లో భాగమేనని వైయ‌స్ఆర్‌సీపీ వర్గాలు పేర్కొన్నాయి.

Back to Top