‘షర్మిల తీరు చూసి వైయ‌స్ఆర్‌ ఆత్మ క్షోభిస్తుంది’ 

వైయ‌స్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి

  విశాఖపట్నం: ముఖ్యమంత్రి చంద్రబాబు చేతిలో షర్మిల పావుగా మారారని వైయ‌స్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఆరోపించారు. తన స్వార్థం కోసం చంద్రబాబు ఎంత నీచానికైనా దిగజారుతారు అంటూ మండిపడ్డారు. షర్మిల తీరు చూసి వైయ‌స్సార్ ఆత్మ క్షోభిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వైయ‌స్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు స్క్రిప్ట్ మేరకే షర్మిల నడుచుకుంటున్నారు. తన కుమార్తె వివాహాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారి వైఎస్ జగన్‌పై విమర్శలు చేస్తున్నారు. దివంగత మహానేత వైఎస్సార్‌ను చంద్రబాబు అనేక సందర్భాల్లో అవమానించారు. షర్మిల తీరు చూసి వైఎస్సార్ ఆత్మ క్షోభిస్తుంది.

ధర్నా విషయం ఆంధ్రజ్యోతికి ముందుగానే ఎలా తెలిసింది?. తన తల్లిపైన కూడా షర్మిల ఒత్తిడి తెస్తున్నారు. తన స్వార్థం కోసం చంద్రబాబు ఎంత నీచానికైనా దిగజారుతారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగిన హింసపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సీఐఐ సదస్సు అట్టర్ ప్లాప్ అయ్యింది. వాటి నుంచి ప్రజల దృష్టి మరల్చడం కోసం చంద్రబాబు.. షర్మిలను రంగంలోకి దించారు. చెట్టాపట్టాల్ అనే పదాన్ని పట్టుకొని షర్మిల తన స్థాయిని తనే దిగజార్చుకుంటున్నారు’ అని ఘాటు విమర్శలు చేశారు. 

Back to Top