తాడేపల్లి: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల వైఖరిపై సోషల్ మీడియాలో మరోసారి చర్చ జరుగుతోంది. ఏ కుటుంబంలోనైనా చిన్నచిన్న సమస్యలు రావడం సహజం. అయితే అలాంటి సమస్యలు బహిరంగ వివాదాలుగా మారినప్పుడు వాటి ప్రభావం కుటుంబ సభ్యులందరిపైనా పడుతుంది. ముఖ్యంగా కుమార్తె వివాహం వంటి జీవితంలో అత్యంత ముఖ్యమైన సందర్భంలో ఇదేం తీరు షర్మిల అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజుల్లో కుమార్తె పెళ్లి పెట్టుకుని షర్మిల రచ్చ చేయడంపై ప్రజలు కూడా ఏంటిదీ అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. బెంగళూరులోని దేవనహళ్లి సివిల్ కోర్టు యలహంకలోని ఆస్తి విషయంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వివాదాస్పద ఆస్తిలోకి ప్రవేశించవద్దని, ఎలాంటి ఆటంకాలు కలిగించవద్దని షర్మిలతోపాటు ఆమె కుటుంబ సభ్యులు, ఏజెంట్లు, ప్రతినిధులను ఆదేశిస్తూ మధ్యంతర నిషేధాజ్ఞలు జారీ చేసింది. ఆస్తికి ఎలాంటి నష్టం కలిగించరాదని స్పష్టం చేసింది. సిలికాన్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన దావాలో లీజు ఒప్పందం, అద్దె చెల్లింపులు, ఇతర పత్రాలను పరిశీలించిన న్యాయస్థానం.. సంస్థ వాదనలకు ప్రాథమిక ఆధారాలున్నాయని అభిప్రాయపడింది. షర్మిలకు నోటీసులు జారీ చేసిన కోర్టు.. అభ్యంతరాలు సమర్పించేందుకు అవకాశం కల్పిస్తూ తదుపరి విచారణను డిసెంబర్ 19కి వాయిదా వేసింది. ఇప్పుడు అందరి దృష్టి షర్మిల తదుపరి అడుగుపైనే ఉంది. కోర్టు ఆదేశాలను అనుసరించి వివాదాస్పద ఆస్తి విషయంలో సంయమనం పాటిస్తారా? లేక ఈ వ్యవహారాన్ని మరింత బహిరంగంగా తీసుకెళ్తారా? అన్నది చూడాల్సి ఉంది. షర్మిల ఈరోజు బెంగళూరు వెళ్లి వివాదం సృష్టిస్తే ఎవరికి లాభం? కుటుంబానికా? తన పిల్లలకా? లేక చంద్రబాబుకా? తనది కాని దాని కోసం కుటుంబ పరువును రోడ్డుకీడ్చడం వెనుక చంద్రబాబుకు రాజకీయంగా మేలు చేయాలనే ఉద్దేశం తప్ప మరేముంది?. అదే ఈరోజు వివాదానికి దూరంగా ఉంటే, తన కుటుంబ గౌరవాన్ని కాపాడుకోవాలని, తన కుమార్తె పెళ్లిని ప్రశాంతంగా, ఘనంగా జరిపించాలని కోరుకుంటున్నట్లు అర్థమవుతుంది. కుటుంబ గౌరవం ముఖ్యమా? చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలు ముఖ్యమా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. చివరికి ప్రజల్లో చర్చకు వస్తున్న ప్రధాన ప్రశ్న ఒక్కటే.. కుటుంబ గౌరవం, కుమార్తె వివాహ ఆనందం ముఖ్యమా? లేక కుటుంబ ఆస్తుల వివాదాన్ని రాజకీయ విమర్శల స్థాయికి తీసుకెళ్లడం ముఖ్యమా?. దీని వల్ల చంద్రబాబుకు రాజకీయ ప్రయోజనమే ఉంటుంది కదా? అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. వైఎస్ జగన్పై ఎల్లో మీడియా ఇంతటి విషం కక్కుతున్నా రాజన్న బిడ్డగా ఎందుకు ప్రశ్నించడం లేదని కామెంట్స్ చేస్తూ విమర్శలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో షర్మిల తీసుకునే తదుపరి నిర్ణయం కీలకంగా మారనుంది. https://x.com/venkey654/status/2124330714309304543?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2124330714309304543%7Ctwgr%5E404185fb33e76146206b0681506151a5ea4c7922%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fandhra-pradesh%2Fnetizens-comments-sharmila-issue-and-cbn-politics-2967451