వైయ‌స్ఆర్ జిల్లాలో కొనసాగుతున్న టీడీపీ అరాచకాలు

ఆదినారాయణరెడ్డి, భూపేష్‌రెడ్డి ఆధ్వర్యంలో దాడులు 

వైయ‌స్ఆర్ జిల్లా: నామినేషన్ల సందర్భంగా టీడీపీ వర్గాల దాడులు కొనసాగుతున్నాయి. యర్రగుంట్ల, ముద్దనూరు మండలాల్లో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులపై దాడులు జరిగాయి. కలమల, మంగపట్నం, దేనేపల్లిలో అభ్యర్థులు, మద్దతుదారులపై దాడులు జరిగాయి. దేనేపల్లి మహిళా అభ్యర్థి గురులలిత తీవ్రంగా గాయపడినట్లు పేర్కొన్నాయి.

కలమలలో వైయ‌స్ఆర్‌సీపీ మద్దతుదారులు గాయపడినా వారిపైనే పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారని పార్టీ వర్గాలు ఆరోపించాయి. చింతకుంటలో వైయ‌స్ఆర్‌సీపీ నామినేషన్‌ పత్రాలను టీడీపీ వర్గాలు చించివేశాయని, బి.కొట్టాలపల్లిలో సర్పంచ్‌ అభ్యర్థి వరలక్ష్మిపై దాడి చేశారని తెలిపాయి. ధర్మాపురంలో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులను నామినేషన్‌ వేయకుండా అడ్డుకున్నారని పేర్కొన్నాయి. ప్రతి నామినేషన్‌ కేంద్రం వద్ద వందలాది మంది టీడీపీ వర్గాలు మోహరించి భయాందోళనలు సృష్టిస్తున్నా పోలీసులు, ఎన్నికల అధికారులు పట్టించుకోవడం లేదని వైయ‌స్ఆర్‌సీపీ వర్గాలు మండిపడ్డాయి.

Back to Top