చిత్తూరు జిల్లా: పుంగనూరు నియోజకవర్గం రొంపిచర్ల మండలం మోటు మల్లెల గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి వైయస్ఆర్‌సీపీ సానుభూతిపరుడు ప్రశాంత్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి సమక్షంలో నామినేషన్ దాఖలు చేసే సమయంలో అన్ని వివరాలు సక్రమంగానే ఉన్నాయని ఆయన తెలిపారు. అయితే స్క్రూటినీ సమయంలో తన నామినేషన్ పత్రంలో దిద్దుబాటు చేసి చెల్లదని తేల్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘అవును’ ఉన్న చోట ‘లేదు’గా దిద్దుబాటు రాష్ట్ర ఎన్నికల సంఘం నమూనాలో వ్యయ ఖాతా నిర్వహణకు సంబంధించి ‘రిటర్నింగ్ అధికారి సమక్షంలో అభ్యర్థి డిక్లరేషన్‌పై సంతకం చేశారా?’ అనే ప్రశ్నకు ప్రశాంత్‌రెడ్డి ‘అవును’ అని రాశారు. ఈ పత్రానికి సంబంధించిన ఫోటోను కూడా తాను తీసుకున్నానని తెలిపారు. స్క్రూటినీలో దిద్దుబాటు చేశారని ఆవేదన అయితే స్క్రూటినీ సమయంలో అదే ప్రశ్నకు తాను రాసిన ‘అవును’ను ‘లేదు’గా దిద్దుబాటు చేశారని ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. కూటమి నేతల ఒత్తిడితోనే ఈ మార్పు జరిగిందని, అనంతరం తన నామినేషన్ పత్రం చెల్లదని అధికారులు తేల్చారని ఆవేదన వ్యక్తం చేశారు. నామినేషన్ దాఖలు సమయంలో ఉన్న పత్రం, స్క్రూటినీ సమయంలో చూపించిన పత్రాన్ని పరిశీలించి న్యాయం చేయాలని ప్రశాంత్‌రెడ్డి కోరుతున్నారు.