నామినేషన్ల వేళ వైయ‌స్ఆర్‌సీపీపై కూటమి దాడులు 

 అభ్యర్థులను అడ్డుకోవడం.. దాడులు, లాఠీఛార్జ్‌లు.. వైయ‌స్ఆర్‌సీపీ నేతల హౌస్ అరెస్టులు 

తాడేప‌ల్లి: గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైయ‌స్ఆర్‌సీపీ మద్దతుతో నామినేషన్లు వేయడానికి వెళ్తున్న అభ్యర్థులను అడ్డుకోవడం, దాడులకు పాల్పడటం, నామినేషన్ కేంద్రాల వద్దకు వెళ్లకుండా నిరోధించడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. పల్నాడు, వైయ‌స్ఆర్, శ్రీకాకుళం జిల్లాల్లో వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, అభ్యర్థులు, సానుభూతిపరులపై దాడులు జరిగాయని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. పలువురు ముఖ్య నేతలను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు.

* పిడుగురాళ్లలో టీడీపీ మూకల హల్‌చల్ 
- జానపాడు సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ వేయడానికి వస్తుండగా అతని ఆటోపై టీడీపీ వర్గాలు దాడి చేశారని వైయ‌స్ఆర్‌సీపీ వర్గాలు తెలిపాయి.
- ఎంపీడీవో కార్యాలయం తలుపులు మూసివేసి అభ్యర్థులను అడ్డుకున్నారని పేర్కొన్నాయి.
- వైయ‌స్ఆర్‌సీపీ సానుభూతిపరులను కార్యాలయం వద్ద ఉండొద్దంటూ ఎస్సై మోహన్ దౌర్జన్యంగా వ్యవహరించారని ఆరోపించారు.
- పోలీసుల తీరుపై వైయ‌స్ఆర్‌సీపీ సానుభూతిపరులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

* పల్నాడులో వైయ‌స్ఆర్‌సీపీ నేతలకు హౌస్ అరెస్టులు 
- మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గృహ నిర్బంధంలో ఉంచి ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు.
- గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డిని పిడుగురాళ్ల నివాసం నుంచి బయటకు రావద్దంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు.
- పంచాయతీ నామినేషన్ల నేపథ్యంలో మహేశ్‌రెడ్డిని గృహ నిర్బంధంలో ఉంచారు.
- మహేశ్‌రెడ్డిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు యత్నించడంతో పిడుగురాళ్లలో ఉద్రిక్తత నెలకొంది.

 *కాసు కార్యాలయం చుట్టూ పోలీసులు 
- కాసు మహేశ్‌రెడ్డి కార్యాలయాన్ని పోలీసులు చుట్టుముట్టారు.
- పోలీసులతో మహేశ్‌రెడ్డి వాగ్వాదానికి దిగారు.
- పోలీసులు ఆయన బెడ్‌రూమ్‌లోకి కూడా ప్రవేశించారని వైయ‌స్ఆర్‌సీపీ వర్గాలు పేర్కొన్నాయి.
- కరల్పాడు, పిడుగురాళ్ల మండలంలో నామినేషన్ వేయడానికి వెళ్తున్న అభ్యర్థులను పోలీసులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

*కల్లమల్లలో వైయ‌స్ఆర్‌సీపీ మద్దతుదారులపై లాఠీఛార్జ్
- ఎర్రగుంట్ల మండలం కల్లమల్లలో నామినేషన్ల సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది.
- వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులపై కూటమి నాయకులు కర్రలు, రాడ్లతో దాడి చేశారని పేర్కొన్నారు.
- దాడిలో వైయ‌స్ఆర్‌సీపీ మద్దతుదారుడికి తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు.
- దాడికి గురైన వారిపైనే పోలీసులు లాఠీఛార్జ్ చేశారని వైయ‌స్ఆర్‌సీపీ వర్గాలు ఆరోపించాయి.

*నాగులగుట్టపల్లిలో నామినేషన్ల వెరిఫికేషన్‌ వేళ ఉద్రిక్తత
- చక్రాయపేట మండలం నాగులగుట్టపల్లిలో నామినేషన్ల వెరిఫికేషన్ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
- గ్రామ సచివాలయాన్ని టీడీపీ వర్గాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయని ఆరోపించారు.
- బీటెక్ రవి, రాంభూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ వర్గాలు హల్‌చల్ చేశాయని పేర్కొన్నారు.
- రాయచోటి–చాగలమర్రి జాతీయ రహదారిపై కర్రలతో టీడీపీ వర్గాలు తిరుగుతూ భయానక వాతావరణం సృష్టించాయని ఆరోపించారు.

 *కల్లమల్లలో నామినేషన్ కేంద్రం వద్ద దాడులు 
- నామినేషన్లు వేయడానికి వెళ్తున్న వైయ‌స్ఆర్‌సీపీ మద్దతుదారులను కూటమి నాయకులు అడ్డుకున్నారని తెలిపారు.
- నామినేషన్ కేంద్రం వద్ద అభ్యర్థులపై కర్రలు, రాళ్లతో దాడి చేశారని పేర్కొన్నారు.
- పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేసి అభ్యర్థులను, మద్దతుదారులను చెదరగొట్టారని తెలిపారు.

 *తొండూరులో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థికి అడ్డంకులు 
- తొండూరు మండలంలోని నామినేషన్ కేంద్రం వద్ద టీడీపీ వర్గాలు తిష్ఠవేశాయని వైయ‌స్ఆర్‌సీపీ వర్గాలు పేర్కొన్నాయి.
- వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థిని నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారని తెలిపారు.
- నామినేషన్ కేంద్రాల వద్ద అభ్యర్థులపై దాడులకు టీడీపీ వర్గాలు పాల్పడుతున్నాయని ఆరోపించారు.

 *చక్రాయపేటలో నామినేషన్ పత్రాలు లాక్కునేందుకు యత్నం 
- నామినేషన్ కేంద్రంలోకి టీడీపీ కార్యకర్తలు చొరబడ్డారని వైయ‌స్ఆర్‌సీపీ వర్గాలు తెలిపాయి.
- అభ్యర్థుల నామినేషన్ పత్రాలను లాక్కునేందుకు యత్నించారని పేర్కొన్నారు.
- నామినేషన్ కేంద్రం వద్ద భద్రత పెంచాలని అభ్యర్థులు కోరుతున్నారు.

 *బంటుపల్లిలో వైయ‌స్ఆర్‌సీపీ సానుభూతిపరులపై దాడులు 
- ఎచ్చెర్ల టీడీపీ ఎమ్మెల్యే సొంత గ్రామమైన బంటుపల్లిలో వైయ‌స్ఆర్‌సీపీ సానుభూతిపరులపై దాడులు జరిగాయని పేర్కొన్నారు.
- సర్పంచ్, వార్డు నామినేషన్లు వెనక్కి తీసుకోవాలంటూ అభ్యర్థులను బెదిరించారని తెలిపారు.
- అభ్యర్థుల ఇళ్లకు వెళ్లి టీడీపీ వర్గాలు దాడులకు పాల్పడ్డాయని వైయ‌స్ఆర్‌సీపీ వర్గాలు ఆరోపించాయి.

Back to Top