మత్స్యకారుల సంక్షేమానికి వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం పెద్దపీట

 మత్స్యకారుల అభ్యున్నతికి రూ.4,913 కోట్ల లబ్ధి.. రూ.16 వేల కోట్లతో నాలుగు పోర్టుల నిర్మాణం

వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ట్వీట్‌

తాడేప‌ల్లి: ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా సముద్రాన్నే నమ్ముకుని జీవనం సాగిస్తున్న గంగపుత్ర సోదర, సోదరీమణులకు వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మత్స్యకారుల సంక్షేమం, అభివృద్ధికి వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో పెద్దపీట వేశామని పేర్కొన్నారు. వివిధ సంక్షేమ పథకాల ద్వారా రూ.4,913 కోట్ల మేర లబ్ధి చేకూర్చడంతో పాటు, మత్స్యకారులకు మెరుగైన వసతులు, ఉపాధి అవకాశాల కోసం రూ.3,793 కోట్లతో 10 ఫిషింగ్‌ హార్బర్లు, 6 ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్ల నిర్మాణాన్ని చేపట్టామని వివరించారు. రూ.16 వేల కోట్లతో నాలుగు పోర్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని, ఓఎన్‌జీసీ పైప్‌లైన్‌ కారణంగా జీవనోపాధి కోల్పోయిన 23,458 మత్స్యకార కుటుంబాలకు రూ.161.86 కోట్ల పరిహారం అందించామని ఎక్స్ వేదిక‌గా వైయ‌స్ జ‌గ‌న్  తెలిపారు. మత్స్యకార కుటుంబాల ఆర్థికాభివృద్ధి, వారి పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు ఎల్లవేళలా అండగా ఉంటానని వైయ‌స్‌ జగన్‌ భరోసా ఇచ్చారు.

Back to Top