ఆత్మకూరులో టీడీపీ అరాచకాలు

వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్న పచ్చ మూకలు

నెల్లూరు జిల్లా: ఆత్మకూరు నియోజకవర్గంలో నామినేషన్ల ప్రక్రియ ఉద్రిక్తంగా మారింది. మర్రిపాడు మండలం సింగనపల్లి గ్రామ సచివాలయం వద్ద వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు నామినేషన్లు వేయకుండా టీడీపీ నేతలు, పోలీసుల నుంచి అడ్డంకులు ఎదురయ్యాయని పార్టీ వర్గాలు తెలిపాయి. నామినేషన్‌ కేంద్రాల వద్ద టీడీపీ నేతలు హడావుడి చేస్తున్నా పోలీసులు, ఎన్నికల అధికారులు పట్టించుకోవడం లేదని పేర్కొన్నాయి.

మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి, ఉదయగిరి సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌రెడ్డిలను నామినేషన్‌ కేంద్రాల వద్దకు రావద్దంటూ పోలీసులు ఆంక్షలు విధించినట్లు వైయ‌స్ఆర్‌సీపీ వర్గాలు తెలిపాయి. నిన్న గోపవరం గ్రామానికి చెందిన వైయ‌స్ఆర్‌సీపీ నాయకుడు కాశిరెడ్డి నామినేషన్‌ పత్రాలను టీడీపీ మూకలు చించివేసిన ఘటనపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశాయి. నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, అభ్యర్థుల పత్రాలు చించివేయడం వంటి ఘటనలు జరుగుతున్నా ఎన్నికల అధికారులు, పోలీసులు చోద్యం చూస్తున్నారని వైయ‌స్ఆర్‌సీపీ వర్గాలు మండిపడ్డాయి.

Back to Top