పశ్చిమగోదావరి జిల్లా: తాడేపల్లిగూడెంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. 38వ వార్డు వైయస్ఆర్‌సీపీ అభ్యర్థి నల్లగొండ స్వప్న ఇంటికి అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించిన ఘటన కలకలం రేపింది. స్థానికులు అప్రమత్తం చేయడంతో స్వప్న కుటుంబ సభ్యులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. జనసేన నాయకులే ఇంటికి నిప్పంటించారని, తమ కుటుంబాన్ని అంతమొందించేందుకు ప్రయత్నిస్తున్నారని బాధిత కుటుంబం ఆరోపించింది. నామినేషన్ ఉపసంహరించుకోవాలని, ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తామని ఫోన్లు చేసి ఒత్తిడి చేశారని, అందుకు అంగీకరించకపోవడంతో బెదిరింపులకు దిగారని వైయస్ఆర్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి వడ్డి రఘురామ్ నాయుడు పేర్కొన్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వడ్డి రఘురామ్ నాయుడు ఘటన అనంతరం బాధిత కుటుంబాన్ని వడ్డి రఘురామ్ నాయుడు పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు. నామినేషన్లు ఉపసంహరించుకోవాలంటూ మున్సిపల్ కార్యాలయం నుంచి అభ్యర్థులకు ఫోన్లు ఎందుకు చేస్తున్నారో అధికారులు వెల్లడించాలని కోరారు. రాత్రి 10.45 గంటల వరకు తుది జాబితాను అధికారులకు అందించడంలో ఎందుకు ఆలస్యం జరిగిందో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. అభ్యర్థుల సంతకాలు లేకుండానే పలుచోట్ల నామినేషన్ల ఉపసంహరణలు జరిగినట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళ్తే పేపర్లు, పెన్నులు ఉన్నాయా అంటూ ఫిర్యాదులు స్వీకరించకపోవడం దారుణమని ఆయన పేర్కొన్నారు. బెదిరింపులకు, దాడులకు భయపడేది లేదని స్పష్టం చేసిన వడ్డి రఘురామ్ నాయుడు, నల్లగొండ స్వప్న కుటుంబానికి వైయస్ఆర్‌సీపీ అన్ని విధాలా అండగా ఉంటుందని, కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. నియోజకవర్గంలో ప్రజాస్వామ్య హక్కులను కాపాడేందుకు పార్టీ పోరాడుతుందని తెలిపారు.