నంద్యాల జిల్లా: పాములపాడు మండల పరిషత్ అధ్యక్ష పదవిని వైయస్ఆర్‌సీపీ కైవసం చేసుకుంది. ఎంపీపీగా పరమేశ్వరి, వైస్ ఎంపీపీగా ప్రతాప్‌రెడ్డి ఎన్నికయ్యారు. అయితే ఎన్నికల సమయంలో టీడీపీ నేతలు రీకౌంటింగ్ కోరుతూ ఆర్వో కార్యాలయంలోకి దూసుకెళ్లి ఆందోళనకు దిగారు. ఎంపీపీ ఎన్నిక పూర్తయిన రోజే రీకౌంటింగ్ ఎలా నిర్వహిస్తారని ఆర్వో ప్రశ్నించినట్లు వైయస్ఆర్‌సీపీ నేతలు తెలిపారు. పాములపాడు ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో నందికొట్కూరు వెళ్లకుండా వైయస్ఆర్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కూటమి నేతలకు ఎన్నికల్లో గెలవడం చేతకాక పోలీసులను అడ్డుపెట్టుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. “ఎన్ని కుట్రలు చేసినా ప్రజాతీర్పుతో గెలిచాం” “మా అభ్యర్థుల నామినేషన్ పత్రాలను చించేశారు. పోలింగ్ సజావుగా జరగకుండా అడ్డుకున్నారు. టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని బెదిరింపులకు పాల్పడినా ప్రజాతీర్పులో మేము గెలిచాం. గెలిచిన తర్వాత కూడా ఎంపీపీ ఎన్నికల్లో టీడీపీ నేతలు పోలీసులను అడ్డుపెట్టుకుని అడ్డంకులు సృష్టిస్తున్నారు. కూటమి నేతలకు ఎన్నికల్లో గెలవడం చేతకాక పోలీసులను అడ్డుపెట్టుకుంటున్నారు. ఎన్ని ఇబ్బందులు పెడతారో పెట్టండి. మా ప్రభుత్వం వచ్చాక పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించుకోండి” అని బైరెడ్డి సిద్ధార్థరెడ్డి స్పష్టం చేశారు. వైయస్ఆర్‌సీపీ శ్రేణుల్లో ఉత్సాహం పాములపాడు ఎంపీపీ, వైస్ ఎంపీపీ పదవులను వైయస్ఆర్‌సీపీ కైవసం చేసుకోవడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ప్రజల తీర్పుతో వచ్చిన విజయాన్ని అడ్డుకునేందుకు టీడీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయిందని వైయస్ఆర్‌సీపీ నేతలు పేర్కొన్నారు.