బుక్కపట్నం ఎంపీపీ, వైస్ ఎంపీపీ వైయ‌స్ఆర్‌సీపీ కైవసం

ఎంపీపీగా పల్లగొర్ల నాగమణి.. వైస్ ఎంపీపీగా సి. చెన్నుడు ఎన్నిక

సత్యసాయి జిల్లా: పుట్టపర్తి నియోజకవర్గం బుక్కపట్నం మండల పరిషత్‌ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులను వైయ‌స్ఆర్‌సీపీ కైవసం చేసుకుంది. గసికవారిపల్లి ఎంపీటీసీ సభ్యురాలు పల్లగొర్ల నాగమణి ఎంపీపీగా, సిద్ధరాంపురం ఎంపీటీసీ సభ్యుడు సి. చెన్నుడు వైస్ ఎంపీపీగా ఎన్నికయ్యారు. మండలంలోని వైయ‌స్ఆర్‌సీపీకి చెందిన ఏడు మంది ఎంపీటీసీ సభ్యులు నాగమణి, చెన్నుడిని ఎన్నుకున్నారు. గసికవారిపల్లి, సిద్ధరాంపురం, బుచ్చయ్యగారిపల్లి, కృష్ణాపురం, కొత్తకోట, పాముదుర్తి, నరసింపల్లి తండా ఎంపీటీసీలు ఈ ఎన్నికలో భాగస్వాములయ్యారు.

వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశీస్సులతో, పుట్టపర్తి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి నాయకత్వంలో ఈ ఎన్నిక జరిగిందని పార్టీ వర్గాలు తెలిపాయి. నూతనంగా ఎన్నికైన ఎంపీపీ నాగమణి, వైస్ ఎంపీపీ చెన్నుడుతో పాటు ఎంపీటీసీ సభ్యులను దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి అభినందించారు.

- గరివిడి ఎంపీపీ పీఠం వైయ‌స్ఆర్‌సీపీ కైవసం 

విజయనగరం జిల్లా గరివిడి మండల ప్రజాపరిషత్‌ అధ్యక్ష పీఠాన్ని వైయ‌స్ఆర్‌సీపీ కైవసం చేసుకుంది. మండల పరిషత్‌ అధ్యక్షుడిగా వైయ‌స్ఆర్‌సీపీకి చెందిన మీసాల విశ్వేశ్వరరావు ఎన్నికయ్యారు. దీంతో గరివిడి మండలంలో వైయ‌స్ఆర్‌సీపీకి ఎంపీపీ పదవి దక్కింది.

- మునగపాక ఎంపీపీగా మొల్లేటి శంకర్ 

అనకాపల్లి జిల్లా మునగపాక మండల పరిషత్‌ అధ్యక్ష పదవి వైయ‌స్ఆర్‌సీపీ కైవసం చేసుకుంది. ఎంపీపీ పదవికి వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థి మొల్లేటి శంకర్‌, కూటమి అభ్యర్థి చెరో 8 ఎంపీటీసీ స్థానాలను గెలుచుకోవడంతో ఫలితం డ్రాకు వెళ్లింది. ఎంపీటీసీల సంఖ్య సమానంగా ఉండటంతో అధికారులు డ్రా నిర్వహించగా, వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థి మొల్లేటి శంకర్‌ను అదృష్టం వరించింది. దీంతో మునగపాక ఎంపీపీ పదవి వైయ‌స్ఆర్‌సీపీ ఖాతాలో చేరింది.

Back to Top