టీడీపీని వీడి వైయ‌స్ఆర్‌సీపీలోకి 20 కుటుంబాలు

 బద్వేల్‌ నియోజకవర్గం అట్లూరులో టీడీపీకి మరో ఎదురుదెబ్బ

వైయ‌స్ఆర్ జిల్లా: బద్వేల్‌ నియోజకవర్గం అట్లూరు మండలం రెడ్డిపల్లి ఎస్సీ కాలనీకి చెందిన టీడీపీకి చెందిన 20 కుటుంబాలు వైయ‌స్ఆర్‌సీపీలో చేరాయి. పోరుమామిళ్లలోని వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, యువ నాయకుడు దేవసాని ఆదిత్యరెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో సిగే నాగమునయ్య, సిగే మాచర్లయ్య, సిగే చంద్ర, సిగే బ్రహ్మయ్య, సిగే బాలకేసి, సిగే చెన్నకేశి, బాల వెంకటయ్య, జవాది రవి, జవాది ఐవరయ్య, గంప వెంకటసుబ్బయ్య, జవాది చిన్న, మాదాపూర్ రవి, మాదాపూరి పెద్ద వెంకటసుబ్బయ్య, గంప రమణయ్య, గంప రమేష్, గంప రత్నమయ్య తదితరులు ఉన్నారు.

 ఎన్నికల్లో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు

డీసీ గోవిందరెడ్డి మాట్లాడుతూ టీడీపీ నుంచి వైయ‌స్ఆర్‌సీపీలోకి వచ్చిన ప్రతి ఒక్కరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని తెలిపారు. రెడ్డిపల్లి గ్రామానికి వైయ‌స్ కుటుంబంతో ప్రత్యేక అనుబంధం ఉందని, దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్ రాజశేఖరరెడ్డి పలుమార్లు గ్రామాన్ని సందర్శించి ప్రజలతో ఆత్మీయ సంబంధం ఏర్పరచుకున్నారని గుర్తుచేశారు. ఎన్నికల ప్రక్రియలో కొందరు అధికారులు సహకరిస్తూ ప్రలోభాలు, ఒత్తిళ్లతో ప్రభావితం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొంటూ, ప్రజలు, అభ్యర్థులు భయపడకుండా ధైర్యంగా ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.  కార్యక్రమంలో అట్లూరు మండల వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి, పార్టీ నాయకులు మల్లికార్జున్‌రెడ్డి, లక్ష్మిరెడ్డి, లక్ష్మీనర్సారెడ్డి, వెంకటేశ్వర్లు, డి.రమణయాదవ్, శ్రీనివాసులు, పెంచల్‌రెడ్డి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Back to Top