గుమ్మలక్ష్మీపురం ఎంపీపీ ఎన్నికల్లో తీవ్ర ఉద్రిక్తత

 వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీటీసీని టీడీపీ నేతలు కిడ్నాప్ 

పార్వతీపురం జిల్లా: గుమ్మలక్ష్మీపురం ఎంపీపీ ఎన్నికల సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీటీసీని టీడీపీ నేతలు కిడ్నాప్ చేశారని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు ఆరోపించారు. కిడ్నాప్ చేసిన ఎంపీటీసీని వెంటనే తమ ముందుకు తీసుకురావాలని డిమాండ్ చేశారు.

ఎంపీటీసీ ఆచూకీ వెల్లడించాలంటూ వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు ఎంపీడీవో కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఎన్నికల ప్రక్రియను నిష్పక్షపాతంగా నిర్వహించాలని, ఎంపీటీసీకి రక్షణ కల్పించి వెంటనే కుటుంబ సభ్యులు, పార్టీ నాయకుల ముందుకు తీసుకురావాలని కోరారు.

Back to Top