హైకోర్టు ఆదేశాలిచ్చినా వేంపల్లిలో అదే అరాచకం

 నామినేషన్లను అడ్డుకునేందుకు భారీగా మోహరించిన టీడీపీ శ్రేణులు 

వైయ‌స్‌ఆర్‌ జిల్లా:  వేంపల్లిలో హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా నామినేషన్ కేంద్రం వద్ద పరిస్థితిలో మార్పు కనిపించలేదని వైయ‌స్ఆర్‌సీపీ వర్గాలు పేర్కొన్నాయి. వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లను అడ్డుకునేందుకు టీడీపీకి చెందిన పెద్ద సంఖ్యలో వ్యక్తులు మోహరించారని, బీటెక్ రవి చిన్నాన్న రఘునాథ్‌రెడ్డి సారథ్యంలో హల్‌చల్ చేస్తున్నారని పేర్కొన్నారు.

చక్రాయపేట మండలం నాగులగుట్టపల్లిలోనూ నిన్నటి ఘటనల నేపథ్యంలో మళ్లీ టీడీపీ వర్గాలు మోహరించాయని, పోలీసులు మాత్రం వారిని నివారించడంలో విఫలమయ్యారని వైయ‌స్ఆర్‌సీపీ ఆరోపించింది. అభ్యర్థులు పోలీసుల రక్షణతో నామినేషన్లు వేసుకునేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో పోలీసులు ఎలా వ్యవహరిస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

Back to Top