నెల్లూరు జిల్లా : కావలి మున్సిపాలిటీ ఎన్నికల్లో 6వ వార్డు వైయస్ఆర్‌సీపీ అభ్యర్థి నామినేషన్‌ను తిరస్కరించేందుకు కూటమి నేతలు కుట్రలు చేస్తున్నారని వైయస్ఆర్‌సీపీ వర్గాలు పేర్కొన్నాయి. నామినేషన్ ప్రక్రియలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే, వైయస్ఆర్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి నామినేషన్ కేంద్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా స్క్రూట్ని విషయంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరగడంతో కావలిలో ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసులు భారీగా మోహరించారు. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డితో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా ఘటనాస్థలిలో ఉండటంతో నామినేషన్ కేంద్రం వద్ద పరిస్థితి ఉత్కంఠగా మారింది. వైయస్ఆర్‌సీపీ అభ్యర్థి నామినేషన్‌ను ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తావులేకుండా నిబంధనల ప్రకారం స్వీకరించాలని పార్టీ నేతలు కోరుతున్నారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, స్వేచ్ఛగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.