బి.కొత్తకోటలో వైయ‌స్ఆర్‌సీపీ జోరు

మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ఖలీల్‌కు మద్దతుగా ఎమ్మెల్యే ద్వారకానాథ్‌రెడ్డి ప్రచారం

అన్న‌మ‌య్య జిల్లా: బి.కొత్తకోట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో వైయ‌స్ఆర్‌సీపీ జోరుగా ముందుకు సాగుతోంది. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ఖలీల్‌కు మద్దతుగా ఎమ్మెల్యే ద్వారకానాథ్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. ప్రజలను కలిసి వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరుతూ ప్రచారంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే ద్వారకానాథ్‌రెడ్డి ప్రచారంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. వైయ‌స్ఆర్‌సీపీ విజయమే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం కొనసాగిస్తున్నారు. ప్రజల ఆశీస్సులతో ఖలీల్‌ను గెలిపించి మున్సిపాలిటీలో వైయ‌స్ఆర్‌సీపీకి పట్టం కట్టాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి.

Back to Top