కావలి: కావలిలో టీడీపీకి మరో షాక్ తగిలింది. టీడీపీ సీనియర్ నాయకుడు పామంజి గోవింద్ ఆ పార్టీని వీడి వైయస్ఆర్‌సీపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే, కావలి నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ ఇన్‌చార్జి రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి సమక్షంలో ఆయన వైయస్ఆర్‌సీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి గోవింద్‌ను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వైయస్ఆర్‌సీపీపై, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి రాజకీయ హుందాతనంపై ఉన్న నమ్మకంతోనే టీడీపీని వీడి వైయస్ఆర్‌సీపీలో చేరినట్లు పామంజి గోవింద్ తెలిపారు. పార్టీ కోసం మరింత శ్రమించి పనిచేస్తానని చెప్పారు. కూటమి ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు గుంటుపల్లి రాజ్‌కుమార్‌చౌదరికి అత్యంత ఆప్తుడిగా ఉన్న టీడీపీ సీనియర్ నాయకుడు వైయస్ఆర్‌సీపీలో చేరడం కావలి నియోజకవర్గ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.