తాడిపత్రిలో పెద్దారెడ్డి ఇంటిపై రాళ్ల దాడి

జేసీ వర్గీయుల దాడిలో 10 వాహనాలు ధ్వంసం.. 20 బైక్‌లకు నిప్పు

అనంత‌పురం జిల్లా: తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిపై జేసీ వర్గీయులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. దాడిలో పెద్దారెడ్డికి చెందిన 10 వాహనాలు ధ్వంసమయ్యాయి. మరో 20 బైక్‌లకు నిప్పు పెట్టినట్లు వైయ‌స్ఆర్‌సీపీ వర్గాలు తెలిపాయి.

ఇంట్లోకి చొరబడి అద్దాలు, ఫర్నీచర్‌ను ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. టీడీపీ మూకలు దాడులకు తెగబడుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని వైయ‌స్ఆర్‌సీపీ వర్గాలు మండిపడ్డాయి.

Back to Top