అర్ధరాత్రి జేసీ అనుచరుల అరాచకం

అనంతపురం జిల్లా: తాడిపత్రి నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొంది. ఇగుడూరు గ్రామంలో వైయ‌స్ఆర్‌సీపీ నేత రంగారెడ్డికి చెందిన స్కార్పియోతో పాటు కారు, రెండు బైకులను జేసీ వర్గీయులు ధ్వంసం చేశారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. సజ్జలదిన్నె పంచాయతీ సర్పంచ్‌ అభ్యర్థి బోయ రాజుకు చెందిన స్కార్పియో వాహనానికి నిప్పు పెట్టినట్లు తెలిపారు.

ఘటనలపై తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులను పరామర్శించిన అనంతరం తాడిపత్రి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద నిరసన తెలిపారు. వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై దాడులు, వాహనాల ధ్వంసానికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. తాడిపత్రి సీఐ నారాయణరెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపించారు.

Jc Followers Set Fire To A Ysrcp Leader Vehicle

Back to Top