గోస్పాడు ఎంపీపీగా పీపీ జగదీశ్వరమ్మ ప్రమాణ స్వీకారం

కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి 

నంద్యాల జిల్లా: గోస్పాడు మండల పరిషత్‌ అధ్యక్షురాలిగా పీపీ జగదీశ్వరమ్మ, వైస్ ఎంపీపీగా మక్బూల్ బాషా గురువారం మండల పరిషత్‌ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైసీపీ సీఈసీ సభ్యుడు పీపీ నాగిరెడ్డి, శ్రీశైలం నియోజకవర్గ పరిశీలకులు పీపీ మధుసూదన్ రెడ్డి, పీపీ జనార్దన్ రెడ్డి, లీగల్ సెల్ నాయకులు వివేకానంద రెడ్డి, మాజీ ఎంపీపీ ఆర్థర్ సైమన్, వైసీపీ నాయకులు రామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Back to Top