శ్రీకాకుళం జిల్లా: నరసన్నపేట నియోజకవర్గం సారవకోట మండలం అన్నుపురం పంచాయతీలో టీడీపీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు వైయస్ఆర్‌సీపీలో చేరారు. లుకలాపు రామారావు, మాలుగు పోలీస్, లక్ష్మీపురం మహేశ్వరరావు, పాలకొండ మనోజ్‌కుమార్, మాలుగు సోమయ్య, పారసింగి శివ, కొత్తూరు కృష్ణారావు, పాలకొండ షణ్ముఖరావు, ఎర్రగడ్డ అక్కులు, కన్నయ్యపేట మోహన్‌రావు, కన్నయ్యపేట పోలారావుతో పాటు మొత్తం 25 కుటుంబాలు వైయస్ఆర్‌సీపీలో చేరాయి. యువ నాయకుడు డాక్టర్ ధర్మాన కృష్ణచైతన్య వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్ఆర్‌సీపీపై ప్రజల్లో ఉన్న ఆదరణ, నమ్మకంతోనే ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పార్టీలో చేరుతున్నారని తెలిపారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.