బొబ్బిలిలో బరితెగించిన కూటమి నాయకులు

 సర్పంచ్‌ నామినేషన్‌ వేయనున్న సన్యాసిరావుకు బెదిరింపులు.. విశాఖలో తలదాచుకున్న అభ్యర్థి 

విజయనగరం జిల్లా: బొబ్బిలి నియోజకవర్గం చింతాడ గ్రామంలో వైయ‌స్ఆర్‌సీపీ మద్దతుతో సర్పంచ్ పదవికి పోటీ చేయనున్న యమ్మల సన్యాసిరావుకు టీడీపీ నేతల నుంచి బెదిరింపులు ఎదురవుతున్నాయని వైయ‌స్ఆర్‌సీపీ వర్గాలు తెలిపాయి. సన్యాసిరావుకు ఫోన్ చేసి గ్రామంలోకి అడుగుపెడితే చంపేస్తామంటూ టీడీపీ నేత, మాజీ సర్పంచ్ చింతాడ జయప్రదీప్‌కుమార్ బెదిరించినట్లు పేర్కొన్నాయి.

బెదిరింపుల నేపథ్యంలో సన్యాసిరావు ప్రస్తుతం విశాఖపట్నంలో తలదాచుకున్నట్లు వైయ‌స్ఆర్‌సీపీ వర్గాలు తెలిపాయి. సర్పంచ్ నామినేషన్‌కు అవసరమైన కుల ధ్రువీకరణ పత్రం కోసం సచివాలయంలో దరఖాస్తు చేసుకున్నా, అధికారులపై ఒత్తిడి తెచ్చి సర్టిఫికెట్‌ జారీ కాకుండా అడ్డుకున్నారని ఆరోపించాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థిని బెదిరించడం, నామినేషన్‌కు అవసరమైన పత్రాలను అడ్డుకోవడం తీవ్ర ఆందోళనకరమని వైయ‌స్ఆర్‌సీపీ వర్గాలు పేర్కొన్నాయి.

Back to Top