రాయలసీమ: ఎంపీపీ ఎన్నికల నేపథ్యంలో వైయస్ఆర్‌సీపీ నేతలను పోలీసులు హౌస్‌అరెస్ట్ చేయడం కలకలం రేపింది. పులివెందుల నియోజకవర్గం వేంపల్లిలో సతీష్‌రెడ్డి, రవిరెడ్డిని పోలీసులు ఇంటికే పరిమితం చేశారు. కర్నూలులో బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డిని హౌస్‌అరెస్ట్ చేసి నందికొట్కూరు నియోజకవర్గానికి వెళ్లకుండా అడ్డుకున్నారు. పాములపాడు ఎంపీపీ ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీకి పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ టీడీపీ అడ్డదారులు తొక్కుతోందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. శింగణమల ఎంపీపీ ఎన్నికలను పర్యవేక్షించేందుకు అనంతపురం నుంచి బయలుదేరిన వైయస్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డిని పోలీసులు హౌస్‌అరెస్ట్ చేశారు. ఇదే సందర్భంగా మాజీ ఎంపీ తలారి రంగయ్యను కూడా అనంతపురంలోని ఆయన నివాసం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఇంటి నుంచి బయటకు రాకుండా గేటు వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. తనను అక్రమంగా హౌస్‌అరెస్ట్ చేయడం సరికాదని తలారి రంగయ్య పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీపీ ఎన్నికల సందర్భంగా వైయస్ఆర్‌సీపీ నేతలను ఎన్నికల కేంద్రాల వద్దకు వెళ్లకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.