పీకే గారి కోటలో కేకే కబుర్లు

జనసేన కార్యాలయం కేంద్రంగా రూ.7 కోట్ల కుంభకోణం

స్వతంత్ర దర్యాప్తుతో నిజాలు నిగ్గు తేల్చాలి

అరె శ్యామలడిమాండ్ 

జ‌న‌సేన కార్యాల‌యం కేంద్రంగా జ‌రిగిన రూ.7 కోట్ల కుంభ‌కోణంపై పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి అరె శ్యామ‌ల‌. 

జనసేన కార్యాలయంలో ఏం జరుగుతోంది.?

⁠రూ.7 కోట్లకు పైగా ఉద్యోగాల కుంభకోణం ఎలా నడిచింది?

జనసేన పెద్దల సహకారంతోనే ఉద్యోగాల పేరుతో భారీ వసూళ్లు జరిగాయా?

14 నెలల వ్యవహారంపై మూడు రోజుల్లోనే షోకాజ్, వివరణ, తొలగింపు ఎలా సాధ్యం?

మీడియా సమావేశంలో కేకే చెప్పిన మాటలతోనే అసలు వ్యవహారం బయటపడింది

ఉద్యోగాల పేరుతో జరిగిన డబ్బుల వసూళ్లు, డిజిటల్, యూపీఐ లావాదేవీలపై సమగ్ర దర్యాప్తు జరగాలి

జనసేన కార్యాలయంలో ప్రైవేట్ కంపెనీ కార్యకలాపాలకు అనుమతి ఎవరిచ్చారు? బాధ్యులెవరో తేల్చాలి

బాధితుల నుంచి వసూలైన ప్రతి రూపాయిని గుర్తించి వారికి తిరిగి ఇప్పించాలి

సిట్‌తో సరిపెట్టకుండా కోర్టు పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తు, సీబీఐ విచారణ జరపాలి

ప్రెస్‌మీట్‌లో తేల్చి చెప్పిన అరె శ్యామ‌ల 

తాడేప‌ల్లి: జనసేన కార్యాలయం కేంద్రంగా రూ.7 కోట్లకు పైగా ఉద్యోగాల పేరుతో భారీగా డబ్బులు వసూలు చేయడం, డిజిటల్‌–యూపీఐ లావాదేవీలు, ప్రైవేట్‌ కంపెనీ కార్యకలాపాలు జనసేన కార్యాలయంలోనే కొనసాగిన విషయాన్ని జనసేన ప్రోగ్రామ్స్‌ కమిటీ చైర్మన్‌ కళ్యాణం శివ శ్రీనివాస్‌ (కేకే) మీడియా సమావేశంలో ఒప్పుకున్నారని వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అరె శ్యామల తెలిపారు. 14 నెలలుగా సాగిన వ్యవహారాన్ని కేవలం మూడు రోజుల్లోనే షోకాజ్‌, వివరణ, తొలగింపుతో ముగించేయడం వెనుక అసలు కథేంటో తేల్చాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె, ఈ కుంభకోణాన్ని సిట్‌తో సరిపెట్టకుండా కోర్టు పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విచారణ జరిపితేనే దీని వెనుక ఉన్న పూర్తి నిజాలు వెలుగులోకి వస్తాయని స్పష్టం చేశారు.
మీడియా స‌మావేశంలో అరె శ్యామ‌ల ఏమ‌న్నారంటే..

- జనసేన కార్యాలయం కేంద్రంగా రూ.7 కోట్ల కుంభకోణం: 
 జనసేన కార్యాలయం కేంద్రంగా రూ.7 కోట్లకు పైగా ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేశారు. డిజిటల్, యూపీఐ లావాదేవీలు జరిగాయి. ప్రైవేట్ కంపెనీ కార్యకలాపాలు జనసేన కార్యాలయంలోనే కొనసాగాయి. ఈ విషయాన్ని జనసేన ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్‌ (కేకే) మీడియా సమావేశంలో స్వయంగా ఒప్పుకున్నారు. మరి జనసేన పెద్దల సహకారం లేకుండా ఇంత పెద్ద వ్యవహారం ఎలా నడిచింది? జనసేన కార్యాలయంలో ప్రైవేట్ కంపెనీ కార్యకలాపాలకు అనుమతి ఎవరిచ్చారు? ఇవన్నీ తేలాల్సిందే. 

- 14 నెలల వ్యవహారాన్ని మూడు రోజుల్లోనే ముగించారా?: 
 14 నెలలుగా ఈ వ్యవహారం కొనసాగితే నవంబర్ 9న షోకాజ్ నోటీసు, నవంబర్ 10న వివరణ, నవంబర్ 11న తొలగింపు ఎలా సాధ్యమైంది? మూడు రోజుల్లోనే మొత్తం వ్యవహారాన్ని ముగించేయడం వెనుక అసలు కథేంటి? ఉద్యోగాల పేరుతో డబ్బులు చెల్లించిన బాధితులు ఎందుకు మోసపోయారు? రూ.8 లక్షలు, రూ.9 లక్షలు సహా డిజిటల్, యూపీఐ లావాదేవీలను పూర్తిగా బయటకు తీయాలి. ఎవరి ఖాతాల్లోకి డబ్బులు వెళ్లాయి, ఎవరెవరు లబ్ధి పొందారో తేల్చాలి. బాధితుల నుంచి వసూలైన ప్రతి రూపాయిని గుర్తించి వారికి తిరిగి ఇప్పించాలి. 

- సిట్‌తో సరిపెట్టొద్దు.. సీబీఐతో నిజాలు తేల్చాలి: 
ఇది ఒక ఉద్యోగిని తొలగించి చేతులు దులుపుకునే వ్యవహారం కాదు.  ఉద్యోగాల పేరుతో జరిగిన వసూళ్లు, కంపెనీ కార్యకలాపాలు, జనసేన కార్యాలయంలో జరిగిన వ్యవహారాలు, బాధితులతో మాట్లాడినవారు, డబ్బులు వసూలు చేసినవారు, లబ్ధి పొందినవారు ఎవరో పూర్తిగా బయటకు రావాలి. జనసేన కార్యాలయంలోని రికార్డులు, సీసీ కెమెరా దృశ్యాలు భద్రపరచాలి. సిట్‌తో ఈ కేసును పక్కదారి పట్టించకుండా కోర్టు పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తు జరపాలి. అవసరమైతే సీబీఐతో విచారణ చేయాలి. అప్పుడే రూ.7 కోట్లకు పైగా జరిగిన ఈ వ్యవహారం వెనుక ఉన్న అసలు నిజాలు, పెద్దల పాత్ర బయటకు వస్తాయి. 

- మీడియా ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇస్తూ..

రామోజీరావు గారి పుట్టినరోజును రాష్ట్ర పండుగగా నిర్వహించే స్థాయికి కూటమి ప్రభుత్వం వెళ్లడం ఏంటి? రేపు రాష్ట్ర రంగు పసుపు, రాష్ట్ర వాహనం సైకిల్‌, రాష్ట్ర భోజనం పప్పన్నం, రాష్ట్ర గీతం ‘జయ జయ చంద్ర’ అని చెప్పుకునే పరిస్థితి తెచ్చేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. మీరు ఎన్ని చేసినా, అన్నింటికీ సమాధానం దొరుకుతుంది. చాలా తొందరగా, చాలా గట్టిగా కరెక్ట్ సమాధానం ఇస్తామ‌ని అరె శ్యామ‌ల స్పష్టం చేశారు.

Back to Top