పులివెందులలో పంచాయతీ ఎన్నికల వేళ టీడీపీ దౌర్జన్యం

నామినేషన్లను అడ్డుకోవడం నుంచి దాడులు, అరెస్టుల వరకు కొనసాగుతున్న పచ్చ మూకల అరాచకం

వైయ‌స్‌ఆర్ జిల్లా: పులివెందుల నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల వేళ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చక్రాయపేట మండలం సురభిలో వైయ‌స్ఆర్‌సీపీ సానుభూతిపరులపై టీడీపీ వర్గాలు రాళ్ల దాడికి పాల్పడటంతో పలువురికి గాయాలయ్యాయి. వేముల మండలం చాగలేరులో జరిగిన దాడుల్లో పలువురు గాయపడటంతో పాటు స్కార్పియో వాహనం ధ్వంసమైంది. వైయ‌స్ఆర్‌సీపీ మద్దతుదారులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు.

తొండూరు మండలంలోనూ వైయ‌స్ఆర్‌సీపీ మద్దతుదారుల నామినేషన్లను అడ్డుకున్నారు. మల్లెల నుంచి నామినేషన్‌ వేసేందుకు వెళ్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. సింహాద్రిపురం మండల వైయ‌స్ఆర్‌సీపీ కన్వీనర్‌ శ్రీకాంత్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారు. బలపనూరు క్లస్టర్‌ కేంద్రం వద్ద పోలీసులతో కలిసి టీడీపీ వర్గీయులు నామినేషన్‌ పత్రాలు లాక్కొని చించి వేశారు.

Back to Top