అమలాపురం: అల్లవరం మండలం తుమ్మలపల్లి గ్రామంలో సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసిన తర్వాత టీడీపీ మాజీ సర్పంచ్ నామినేషన్ దాఖలు చేయడంపై అమలాపురం నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ అసెంబ్లీ కోఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా నామినేషన్ స్వీకరించారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేస్తూ అర్ధరాత్రి 11 గంటల సమయంలోనూ నిరసన కొనసాగించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేసి, ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిబంధనలకు విరుద్ధంగా జరిగిన నామినేషన్ ప్రక్రియపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొమ్మ ఇజ్రాయిల్, మాజీ ఎంపీ చింతా అనురాధ, మండల నాయకులు, వైయస్ఆర్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.