సున్నిపెంటలో వైయ‌స్ఆర్‌సీపీ జెండా ఎగురవేద్దాం

తొలి పంచాయతీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలి

మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి పిలుపు

 శ్రీశైలం: సున్నిపెంట పంచాయతీగా ఏర్పాటైన తర్వాత తొలిసారిగా జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ జెండా ఎగురవేయాలని శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్ ఎన్నికల సన్నద్ధతపై సున్నిపెంటలోని రెడ్ల కళ్యాణ మండపంలో ఆయన అధ్యక్షతన ముఖ్య సమావేశం నిర్వహించారు.  

ఎన్నికల వ్యూహంపై విస్తృత చర్చ

రాబోయే గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి చేపట్టాల్సిన సన్నద్ధత, అనుసరించాల్సిన వ్యూహాలు, భవిష్యత్ కార్యాచరణపై సమావేశంలో నాయకులు తమ అభిప్రాయాలను, విలువైన సూచనలను వెల్లడించారు. గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేస్తూ ఎన్నికలను సమర్థంగా ఎదుర్కొనే అంశాలపై చర్చించారు. సున్నిపెంటలో జరిగే తొలి పంచాయతీ ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థి విజయానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని శిల్పా చక్రపాణిరెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల సన్నద్ధతను ఇప్పటి నుంచే పటిష్టంగా చేపట్టి, పార్టీ శ్రేణుల మధ్య సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు.

ఈ సమావేశంలో శ్రీశైలం నియోజకవర్గ నాయకుడు శిల్పా భువనేశ్వర్‌రెడ్డి, వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి గంగుమాల శోభ‌న్‌బాబుతో పాటు వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల ప్రతినిధులు, యూనియన్ నాయకులు, కుల సంఘాల నాయకులు, వ్యాపార సంఘాల నాయకులు పాల్గొన్నారు. 

Back to Top