వైయస్ఆర్ జిల్లా: వేంపల్లిలో వైయస్ఆర్‌సీపీ ముఖ్య నాయకులతో ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి సమావేశమయ్యారు. రాబోయే సర్పంచ్ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై పార్టీ నేతలతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో టీడీపీ దౌర్జన్యాలు, రిగ్గింగ్‌కు పాల్పడిందని మండిపడ్డారు. పులివెందులలో 166 పోలింగ్ బూత్‌లలో ఎన్నికలు జరగగా, అందులో సగం బూత్‌లను టీడీపీ స్వాధీనం చేసుకుని దౌర్జన్యాలకు పాల్పడిందని ఆరోపించారు. సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా ఎస్ఈసీ, పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని అవినాష్‌రెడ్డి కోరారు. వైయస్ జగన్ హయాంలో వేంపల్లి అభివృద్ధి పరుగులు పెట్టిందని, రోడ్ల విస్తరణలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు రూ.50 లక్షల పరిహారం చెల్లించామని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వేంపల్లిలో అభివృద్ధి, శాంతిభద్రతలు క్షీణించాయని పేర్కొన్నారు. అజయ్‌రెడ్డిపై హాకీ కర్రలతో దాడి మొదలుకొని ఇప్పటివరకు కూటమి నేతల దౌర్జన్యాలు కొనసాగుతున్నాయని అవినాష్‌రెడ్డి అన్నారు. వైయస్ఆర్‌సీపీ మద్దతుదారులపై దాడులు, కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, సర్పంచ్ ఎన్నికల వేళ సర్పంచ్ అభ్యర్థి షబ్బీర్‌కు చెందిన రైస్‌మిల్లుపై అక్రమంగా దాడి చేసి సీజ్ చేశారని తెలిపారు. వేంపల్లి అభివృద్ధి, శాంతిభద్రతల కోసం ప్రజలు తమ ఓటుతో సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు.