ప్రకాశం జిల్లా: మున్సిపల్, పరిషత్ ఎన్నికల మాదిరిగానే పంచాయతీ ఎన్నికల్లోనూ టీడీపీ గూండాలు దౌర్జన్యానికి దిగుతున్నారు. టంగుటూరు మండలం మర్లపాడులో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. వైయస్ఆర్‌సీపీ సానుభూతిపరులు సర్పంచ్, వార్డు సభ్యులుగా నామినేషన్లు దాఖలు చేసేందుకు వెళ్తుండగా టీడీపీకి చెందిన వ్యక్తులు అడ్డుకుంటున్నారు. నామినేషన్లు దాఖలు చేసేందుకు అభ్యర్థులు ముందుకు వస్తున్నప్పటికీ వారిని అడ్డుకోవడం, బెదిరింపులకు పాల్పడటం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఎన్నికల ప్రక్రియ స్వేచ్ఛగా, పారదర్శకంగా సాగాల్సి ఉండగా అధికార పార్టీకి చెందిన వ్యక్తులు అడ్డంకులు సృష్టిస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. నామినేషన్ వేసే ప్రతి అభ్యర్థికి రాజ్యాంగం కల్పించిన హక్కును కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని వైయస్ఆర్‌సీపీ పేర్కొంది. మర్లపాడులో జరుగుతున్న అడ్డంకులను వెంటనే నిలువరించి, అభ్యర్థులు ఎలాంటి భయాందోళనలు లేకుండా నామినేషన్లు దాఖలు చేసేలా పోలీసులు, ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని కోరింది.