తాడేపల్లి: మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్‌తో పాటు, ఆయన కుటుంబ సభ్యులపై వెన్నుపోటు పార్టీ నాయకుడు కొమ్మారెడ్డి పట్టాభిరామ్, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ తప్పుడు ప్రచారాలు, నిరాధార కథనాలతో విషం చిమ్ముతున్నారని వైయస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరు వెంకట్‌రెడ్డి ధ్వజమెత్తారు. రాధాకృష్ణ అడ్డగోలు రాతలు, ఆర్థిక అక్రమాలు, గవర్నర్ బంగ్లా సీసీ కెమెరాల వ్యవహారం, చందాల దోపిడీ వంటి దుర్మార్గాలను ఎండగట్టిన ఆయన, వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వాన్ని సూటిగా నిలదీశారు. ఒకవేళ తాము కూడా చంద్రబాబు అనారోగ్యం నాటకం, లోకేష్ సంస్కారహీన భాష, మెంటల్ సర్టిఫికెట్ ఎమ్మెల్యే గురించి మాట్లాడటం మొదలుపెడితే తలకాయలు ఎక్కడ పెట్టుకుంటారని నిలదీశారు. తమది సంస్కారవంతమైన పార్టీ కాబట్టే మహిళల పట్ల మర్యాదగా వ్యవహరిస్తున్నామని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కారుమూరు వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రెస్మీట్లో కారుమూరు వెంకట్‌రెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..: - డైవర్షన్ పాలిటిక్స్ కోసమే విషప్రచారం: సాధారణంగా మనం చాలాసార్లు మనుషుల గురించి మాట్లాడుకున్నాం. కానీ ఈ రోజు మనుషుల రూపంలో ఉన్న రెండు జంతువుల గురించి మాట్లాడాల్సి వస్తోంది. ఒకరేమో రాజకీయ పార్టీ ముసుగులో ఏ మాత్రం నైతికత లేకుండా వ్యవహరిస్తున్న కొమ్మారెడ్డి పట్టాభిరాం. మరొకరు పత్రిక ముసుగులో అసలు జర్నలిజానికి పూర్తిగా పాతరేసి ఇతర వ్యవహారాలన్నీ చక్కబెట్టుకుంటున్న ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. ఈ ఇద్దరూ పని చేసేది చంద్రబాబునాయుడు కోసమే. ఇటీవల కూటమి ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేసి, కోట్లు ఖర్చు చేసి నిర్వహించిన భాగస్వామ్య సదస్సు అట్టర్‌ఫ్లాప్ కావడంతో వర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టారు. తండ్రీ కొడుకులు చంద్రబాబు, లోకేష్‌కు క్రెడిట్ చోరీ రోగం పట్టుకుంది. అందుకే భాగస్వామ్య సదస్సుకు రీల్స్ చేసుకునే వారు, గీతం కాలేజీ విద్యార్థులకు సూట్లు బూట్లు వేసి తీసుకొచ్చి నానా హంగామా చేయించి, విపరీతంగా ప్రచారం చేసుకున్నారు. మరోవైపు జగన్‌గారి ఐదేళ్ల పాలనలో ఆరోగ్య సూచిక, సామాజిక ఆర్థిక భద్రత, న్యాయ సేవల అందుబాటులో ఏపీ అగ్రస్థానంలో నిలిచిందని ‘ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ (జేజీయూ)’ కి చెందిన ‘సెంటర్ ఫర్ న్యూ ఎకనామిక్స్ స్టడీస్’ (సీఎన్ఈఎస్).. ‘యాక్సెస్ (ఇన్)ఈక్వాలిటీ ఇండెక్స్’ (ఏఈఐ) నివేదిక విడుదల చేసింది. అయితే అది తమ ఘనతగా చెప్పుకునేందుకు తండ్రీ కొడుకులు క్రెడిట్ చోరీకి పాల్పడగా, జగన్‌గారు ఎక్స్ (ట్విటర్) వేదికగా గణాంకాలు, తేదీలతో సహా వీరి బాగోతాన్ని బయటపెట్టారు. వీరి క్రెడిట్ చోరీని సోషల్ మీడియాలో బట్టలూడదీసి నిలబెట్టారు. దీంతో ఈ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు వ్యక్తిగత దూషణలకు దిగారు. - మేము ప్రశ్నించడం మొదలుపెడితే తట్టుకోలేరు: రాజకీయంగా జగన్‌గారిని ఎదుర్కోలేక, ఆయన తల్లి, చెల్లి, భార్య గురించి నీచంగా మాట్లాడిస్తున్నారు. భారతమ్మ గారి గురించి కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. మేము సంస్కారంగా వ్యవహరిస్తున్నాం కాబట్టే ఊరుకుంటున్నాం. మేము కూడా అదే భాషలో ప్రశ్నించడం మొదలుపెడితే మీ తలకాయలు తీసుకెళ్లి కరకట్టలో పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. జగన్‌గారి తల్లి, చెల్లి, భార్య గురించి నీచంగా మాట్లాడిస్తూ చంద్రబాబు, లోకేష్ తమ సంస్కారం ఏంటో బయట పెట్టుకున్నారు. మరోసారి భారతిగారి గురించి మాట్లాడితే మేము కూడా అదే భాషలో సమాధానం చెప్పాల్సి వస్తుంది. అనారోగ్య కారణాలన్నీ సాకుగా చూపి బెయిల్ తెచ్చుకున్న చంద్రబాబు, ఈ మధ్య గతి తప్పి మాట్లాడుతున్నారు. తీవ్ర కరవు పరిస్థితులుంటే, తాను ప్రార్థించగానే విశాఖలో విపరీతంగా వర్షం కురిసిందని విచిత్రంగా మాట్లాడిన చంద్రబాబు గురించి మేము భువనేశ్వరి గారిని అడగాలా?. రెడ్ బుక్, కడ్రాయర్లు అంటూ పిచ్చి వాగుడు వాగుతున్న లోకేష్‌ను కంట్రోల్లో పెట్టమని మేము బ్రాహ్మణి గారిని అడగలేమా? మెంటల్ సర్టిఫికెట్ ఎమ్మెల్యే గురించి వసుంధర గారిని మేము కూడా ప్రశ్నిస్తే తలకాయలు ఎక్కడ పెట్టుకుంటారు?. మళ్లీ ఇలాంటి పిచ్చి వాగుడు వాగితే, మీ ఇళ్లల్లో డైనింగ్ టేబుల్ వద్ద జరిగే అత్తాకోడళ్ల వ్యవహారాలను కూడా బయటపెట్టాల్సి వస్తుంది. - ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు బహిరంగ సవాల్: పత్రిక ముసుగులో రాజకీయ వ్యభిచారం చేస్తున్న ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రెండు రోజులుగా జగన్ బంటు, రాబందు అంటూ అడ్డగోలు కథనాలు రాస్తున్నాడు. 20 ఏళ్లుగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తూ, పక్కాగా పన్ను కూడా చెల్లిస్తూ వ్యాపారం చేసుకుంటున్న వ్యక్తిపై నిరాధార ఆరోపణలు చేస్తూ రాస్తారా?. నీకు దమ్ముంటే చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ ఆస్తులపైనా, నువ్వు అంటున్న మా వాళ్ల ఆస్తులు.. రెండింటిపైనా సీబీఐ విచారణ కోరాలి. రూ.2 వేల కోట్ల వ్యవహారానికి సంబ«ంధించి, శ్రీనివాస్ వద్ద పక్కా ఆధారాలు దొరకడంతో, వివరణ కోరగా, గుట్టు చప్పుడు కాకుండా అతడు విదేశాలకు ఎలా పారిపోయాడు? ఎవరు అతణ్ని పంపించారు? కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఎందుకు తిరిగి వచ్చాడు? అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లిపోవడంతో, తీసుకున్న క్రమశిక్షణ చర్యలను కూడా రద్దు చేసి, తిరిగి పెండ్యాల శ్రీనివాస్‌కు ఎలా ఉద్యోగం ఇచ్చారు? ఇవన్నీ రాసే దమ్ముందా?. - నీ చరిత్ర, కుటుంబ వ్యవహారాలు బయటపెడతాం: మా పార్టీ నేతలు, వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబ సభ్యులు, మహిళలపై ఆధారాలు లేని వార్తలు రాస్తున్న మీకు.. మీ వ్యక్తిగత వ్యవహారాలపై వార్తలు రాసే దమ్ముందా? గవర్నర్ బంగ్లాలో సీసీ కెమెరాల ఏర్పాటు, యూకో బ్యాంకుకు ఎగ్గొట్టిన బకాయిలు, అవిభక్త కవలలు వీణా–వాణి పేరుతో సేకరించి, దోచుకున్న విరాళాలు, ఫిలింనగర్ కార్యాలయ నిర్మాణ ఖర్చులు, నీ ఆస్తుల వివరాలపై మీ పత్రికలో ఎందుకు రాయడం లేదు? ఇవన్నీ ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మీకు లేదా? అని రాధాకృష్ణను కారుమూరు వెంకట్‌రెడ్డి సూటిగా నిలదీశారు.