ముద్రగడ గిరిబాబు సమక్షంలో వైయ‌స్ఆర్‌సీపీలోకి ఐదు కుటుంబాల చేరిక

ప్రత్తిపాడు మండలం రాచపల్లి గ్రామానికి చెందిన కుటుంబాలకు పార్టీ కండువా కప్పి ఆహ్వానం

కాకినాడ జిల్లా : ప్రత్తిపాడు మండలం రాచపల్లి గ్రామానికి చెందిన సుమారు ఐదు కుటుంబాలు వైయ‌స్ఆర్‌సీపీలో చేరాయి. గ్రామ వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు బంకు శ్రీను యూత్ ఆధ్వర్యంలో కిర్లంపూడిలోని ముద్రగడ గిరిబాబు నివాసానికి చేరుకున్న వారు పార్టీలో చేరారు. ప్రత్తిపాడు నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌చార్జ్ ముద్రగడ గిరిబాబు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు సమష్టిగా పనిచేయాలని ఈ సందర్భంగా సూచించారు.

Back to Top