సాంకేతికతలో కొత్త ఒరవడి.. నటనలో ప్రత్యేక ముద్ర వేసిన సూపర్‌స్టార్ కృష్ణ

మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ట్వీట్ 

కృష్ణ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి

తాడేపల్లి :  సూపర్‌స్టార్ కృష్ణ వర్ధంతి సందర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి ఘన నివాళులర్పించారు. తెలుగు సినిమాకు కృష్ణ అందించిన సేవలను, తమ కుటుంబంతో ఆయనకున్న ఆత్మీయ అనుబంధాన్ని వైయ‌స్ జగన్ స్మరించుకున్నారు.

సినిమాస్కోప్‌, 70 ఎంఎం వంటి సాంకేతికతలను తెలుగు సినిమాకు పరిచయం చేసి కొత్త ఒరవడి తీసుకువచ్చిన సాహసి సూపర్‌స్టార్ కృష్ణ అని వైఎస్ జగన్ కొనియాడారు. తన విలక్షణమైన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న గొప్ప నటుడిగా ఆయనను గుర్తుచేసుకున్నారు.

నిర్మాతల శ్రేయస్సును ఎప్పుడూ కోరుకుంటూ, వారికి అండగా నిలిచిన మంచి మనసున్న వ్యక్తి కృష్ణ అని వైయ‌స్ జగన్ పేర్కొన్నారు. తన తండ్రి వైయ‌స్ రాజశేఖరరెడ్డికి కృష్ణ ఎంతో ఆప్తుడని గుర్తుచేసుకుంటూ, ఆయనతో తమ కుటుంబానికి ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని స్మరించుకుంటూ మనస్ఫూర్తిగా నివాళులర్పించారు.

Back to Top