తిరుపతి జిల్లా: వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు భూమన అభినయ్‌రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసిన కార్పొరేటర్ అభ్యర్థులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన ప్రతి అభ్యర్థి, నాయకుడు, కార్యకర్త కృషిని ఈ సందర్భంగా అభినందించారు. ఎన్నికల సమయంలో ఎదురైన సవాళ్లు, అడ్డంకులను అధిగమిస్తూ పార్టీ కోసం ధైర్యంగా నిలబడిన ప్రతి ఒక్కరి సేవలను గుర్తు చేసుకున్నారు. గెలుపోటములు సహజమేనని, పార్టీ కోసం నిలబడిన ప్రతి ఒక్కరూ తమ దృష్టిలో విజేతలేనని పేర్కొన్నారు. సమావేశంలో ఎన్నికల అనుభవాలు, పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రతి డివిజన్‌లో వైయస్ఆర్‌సీపీని మరింత బలోపేతం చేయాలని నాయకులు, కార్యకర్తలు సంకల్పించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డితో పాటు పార్టీ నాయకులు పాల్గొన్నారు.